iDreamPost

తన ఫేవరెట్ సింగర్ ను అన్ ఫాలో చేసిన విరాట్ కోహ్లీ! కారణం ఏంటంటే?

  • Author Soma Sekhar Published - 10:58 AM, Wed - 20 September 23
  • Author Soma Sekhar Published - 10:58 AM, Wed - 20 September 23
తన ఫేవరెట్ సింగర్ ను అన్ ఫాలో చేసిన విరాట్ కోహ్లీ! కారణం ఏంటంటే?

విరాట్ కోహ్లీ.. వరల్డ్ క్రికెట్ ను శాసిస్తున్న రారాజు. టీమిండియా రన్ మెషిన్ గా, రికార్డుల రారాజుగా ప్రపంచ క్రికెట్ పై తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక తన బ్యాటింగ్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. చివరికి పాకిస్థాన్ లో కూడా విరాట్ కు ఎంతో క్రేజ్ ఉంది. అలాంటి విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ సింగర్ ను ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విరాట్ కోహ్లీ కెనడాకు చెందిన పంజాబీ ర్యాపర్ శుభ్ ను అన్ ఫాలో చేశాడు. శుభ్ పాటలకు డ్యాన్స్ లు వేసిన కోహ్లీ అతడిని ఎందుకు అన్ ఫాలో చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

కెనడాకు చెందిన పంజాబీ ర్యాపర్ శుభ్ ను తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి అన్ ఫాలో చేశాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఈ న్యూస్ అటు ఇండస్ట్రీలో.. ఇటు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ పంజాబీ ర్యాపర్ ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో వక్రీకరించిన భారతదేశ మ్యాప్ ను పోస్ట్ చేశాడు. ఇక తన పోస్ట్ లో పంజాబ్, హర్యానాలను ప్రత్యేక దేశాలుగా చూపించారు. దీంతో దేశవ్యాప్తంగా శుభ్ పై విమర్శలు వెల్లువెత్తాయి.

Kolhi unfollowed his favorite singer

ఈ క్రమంలోనే శుభ్ ఖలిస్థాన్ ఉద్యమానికి మద్దతుదారుడని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఈ సంఘటన తర్వాత విరాట్ కోహ్లీ అతడిని తన ఇన్ స్టాగ్రామ్ నుంచి అన్ ఫాలో చేశాడు. కాగా.. 2023 IPL టైమ్ లో కోహ్లీ-అనుష్క శర్మలు శుభ్ ఎలివేటెడ్ పాటకు జిమ్ లో డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ అప్పట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మరి స్టార్ సింగర్ ను విరాట్ కోహ్లీ అన్ ఫాలో చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి