iDreamPost

కోహ్లీని విమర్శించే వారి నోరు మూయించిన బాబర్ ఆజం! తేల్చి చెప్పాడు!

  • Published Apr 08, 2024 | 8:16 PMUpdated Apr 08, 2024 | 8:16 PM

విరాట్ కోహ్లీని విమర్శించే వారి నోళ్లు మూయించాడు పాక్ వైట్ బాల్ కెప్టెన్ బాబర్ ఆజం. తాను చెప్పాలని అనుకున్నది నిక్కచ్చిగా తేల్చి చెప్పాడు.

విరాట్ కోహ్లీని విమర్శించే వారి నోళ్లు మూయించాడు పాక్ వైట్ బాల్ కెప్టెన్ బాబర్ ఆజం. తాను చెప్పాలని అనుకున్నది నిక్కచ్చిగా తేల్చి చెప్పాడు.

  • Published Apr 08, 2024 | 8:16 PMUpdated Apr 08, 2024 | 8:16 PM
కోహ్లీని విమర్శించే వారి నోరు మూయించిన బాబర్ ఆజం! తేల్చి చెప్పాడు!

క్రికెట్​లో బెస్ట్ బ్యాట్స్​మన్ ఎవరు? అనేది నెవర్ ఎండింగ్ డిస్కషన్. గత జనరేషన్​లో సచిన్ టెండూల్కర్ బెస్ట్ బ్యాటర్​గా కీర్తిని అందుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ వారసుడు ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈతరంలో టీమిండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీనే బెస్ట్ బ్యాట్స్​మన్ అని అందరూ అంటుంటారు. అభిమానులు, లెజెండరీ ప్లేయర్ల దగ్గర నుంచి ప్రస్తుతం క్రికెట్ ఆడే ఆటగాళ్ల వరకు అందరూ కోహ్లీ పేరే చెబుతుంటారు. అందుకు అతడు చేసిన పరుగులు, రికార్డులు ఉదాహరణగా చెప్పొచ్చు. కానీ పాకిస్థాన్ ఫ్యాన్స్ మాత్రం బాబర్ ఆజం తోపు అని అంటుంటారు. అంతేగాక కోహ్లీ గ్రేట్ కాదని విమర్శిస్తుంటారు. వారికి బాబర్ ఇచ్చిపడేశాడు. కింగ్​ను క్రిటిసైజ్ చేసేవారి నోళ్లు మూయించాడు.

కోహ్లీకి బాబర్​కు మధ్య ఎప్పటినుంచో కంపారిజన్ నడుస్తూ వస్తోంది. ఆ మధ్య ఈ పాక్ బ్యాటర్ మంచి ఫామ్​లో ఉండటంతో పాకిస్థాన్ అభిమానులు రెచ్చిపోయారు. బాబర్ ముందు విరాట్ పనికిరాడంటూ నెట్టింట ట్రోల్ చేశారు. అయితే ఎట్టకేలకు ఈ కంపారిజన్స్, ట్రోల్స్ మీద బాబర్ ఆజం రియాక్ట్ అయ్యాడు. విరాట్​ను మించినోడు లేడని.. అతడు బెస్ట్ బ్యాటర్ అంటూ ఆకాశానికెత్తేశాడు. బ్యాటింగ్​లో కింగ్ తోపు అని తేల్చి చెప్పేశాడు. ‘విరాట్ కోహ్లీని ఎప్పుడు కలిసే అవకాశం వచ్చినా అతడి దగ్గర నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకుంటా. కోహ్లీ బెస్ట్ బ్యాటర్. అతడితో పాటు కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ కూడా తోపు బ్యాటర్లు. ఈ ముగ్గుర్ని ఎప్పుడు కలిసే ఛాన్స్ వచ్చినా వాళ్ల దగ్గర నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు ట్రై చేస్తుంటా’ అని బాబర్ చెప్పుకొచ్చాడు.

టీమిండియాతో మ్యాచ్ ఉంటే కోహ్లీని తప్పక కలుస్తానని, అతడితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని బాబర్ తెలిపాడు. బ్యాటింగ్​కు సంబంధించి నేను అడిగే క్వశ్చన్స్​కు విరాట్ ఓపిగ్గా ఆన్సర్స్ చెబుతాడని పేర్కొన్నాడు. బ్యాటింగ్​తో పాటు మిగిలిన విషయాలను కూడా తాము మాట్లాడుకుంటామన్నాడు. విలియమ్సన్, స్మిత్​తో కూడా కలిసిన ప్రతిసారి చాలా సేపు బ్యాటింగ్​తో పాటు ఇతర విషయాలను డిస్కస్ చేస్తుంటానని వ్యాఖ్యానించాడు. బాబర్ కామెంట్స్​పై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కోహ్లీ తన కంటే తోపు అని, అతడి నుంచే నేర్చుకుంటానని స్వయంగా ఆజమ్ చెప్పేశాడు కాబట్టి ఇక్కడితో దీన్ని ఆపేయాలని అంటున్నారు. విరాట్​ గురించి బాబర్ చేసిన వ్యాఖ్యలతో బెస్ట్ బ్యాటర్ ఎవరు? అనేది తేలిపోయిందని చెబుతున్నారు. మరి.. కోహ్లీని మించినోడు లేడంటూ బాబర్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నా ఆట లెక్కలోకి రాదు.. ముంబై గెలుపు మీద రోహిత్ కామెంట్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి