iDreamPost

Virat Kohli: ప్రతిష్టాత్మక అవార్డు రేసులో కోహ్లీ.. టీమిండియా ప్లేయర్లతోనే పోటీ!

ప్రతిష్టాత్మకమైన అవార్డు రేసులో టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. అయితే ఈ అవార్డు రేసులో మరో ఇద్దరు భారత ఆటగాళ్లు ఉండటం గమనార్హం. మరి ఆ అవార్డు ఏంటి? కోహ్లీని ఢీ కొంటున్న వాళ్లెవరు? ఆ వివరాలు..

ప్రతిష్టాత్మకమైన అవార్డు రేసులో టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. అయితే ఈ అవార్డు రేసులో మరో ఇద్దరు భారత ఆటగాళ్లు ఉండటం గమనార్హం. మరి ఆ అవార్డు ఏంటి? కోహ్లీని ఢీ కొంటున్న వాళ్లెవరు? ఆ వివరాలు..

Virat Kohli: ప్రతిష్టాత్మక అవార్డు రేసులో కోహ్లీ.. టీమిండియా ప్లేయర్లతోనే పోటీ!

టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ 2023లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు రేసులో నిలిచాడు కోహ్లీ. అయితే ఈ రేసులో విరాట్ కు ఊహించని పోటీ ఎదురైంది. ఆ పోటీ ఇతర దేశాల ఆటగాళ్ల నుంచి కాదు.. స్వయాన టీమిండియా ప్లేయర్ల నుంచే. అవును విరాట్ కోహ్లీతో పాటుగా ఈ అవార్డు కోసం మరో ఇద్దరు భారత ఆటగాళ్లు పోటిపడుతున్నారు. వీరి ముగ్గురితో పాటుగా న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ కూడా ఆ అవార్డుకు నామినేట్ చేయబడ్డాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రపంచ క్రికెట్ లో ఏడాది పొడవునా అద్భుతంగా రాణించిన ఆటగాళ్లకు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును అందజేస్తుంది. మూడు ఫార్మాట్స్ కు సంబంధించి ప్లేయర్లను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎంపిక చేస్తుంది. అందులో భాగంగా 2023 వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కు నామినేట్ అయిన ఆటగాళ్లను ప్రకటించింది ఐసీసీ. ఈ అవార్డుకు నలుగురిని నామినేట్ చేయగా.. అందులో ముగ్గురు టీమిండియా ప్లేయర్లే కావడం విశేషం. భారత జట్టు నుంచి యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్, వరల్డ్ కప్ హీరో మహ్మద్ షమీ, రన్ మెషిన్ విరాట్ కోహ్లీలు ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. వీరితో పాటుగా కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ సైతం ఈ అవార్డు కోసం పోటీపడుతున్నాడు. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లే ఉండటంతో.. వారిలో ఎవరైనా వన్డే క్రికెటర్ అవార్డు పొందొచ్చు.

ఇక 2023లో ఈ నలుగురి ఆటగాళ్ల ఫర్పామెన్స్ గురించి ఓ లుక్కేద్దాం పదండి. ముందుగా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే.. 2023లో మెుత్తం 27 వన్డేలు ఆడిన కింగ్ 1377 పరుగులు చేశాడు. ఓ వికెట్ తో పాటుగా 12 క్యాచ్ లు అందుకున్నాడు. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో 756 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును సైతం అందుకున్నాడు. ఈ క్రమంలనే సచిన్ ఆల్ టైమ్ 49 సెంచరీల రికార్డును కూడా బ్రేక్ చేశారు విరాట్. కాగా.. మరో టీమిండియా ప్లేయర్ అయిన మహ్మద్ షమీ ఈ సంవత్సరం అద్భుత ప్రదర్శనలో అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. మెుత్తం 19 వన్డేలు ఆడి, 43 వికెట్లు పడగొట్టాడు. 36 పరుగులతో పాటుగా మూడు క్యాచ్ లు కూడా అందుకున్నాడు. వరల్డ్ కప్ లో కేవలం 7 మ్యాచ్ ల్లో 24 వికెట్లు తీసి.. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా రికార్డుకెక్కాడు.

టీమిండియా యంగ్ సెన్సేషన్ శుబ్ మన్ గిల్ 2023లో గొప్పగా రాణించాడు. అతడు 29 వన్డేలు ఆడి 1584 పరుగులు చేశాడు. ఈ లిస్ట్ లో టీమిండియా ప్లేయర్లతో పాటుగా పోటీపడుతున్న డారిల్ మిచెల్ 26 వన్డేల్లో 1204 రన్స్ బాదడంతో పాటుగా 9 వికెట్లు, 22 క్యాచ్ లు అందుకున్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ లో దుమ్మురేపాడు డారిల్ మిచెల్. ఈ మెగాటోర్నీలో 552 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. మరి ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది అవార్డును ఎవరు గెలుచుకుంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి