iDreamPost

Virat Kohli: రికార్డుల రారాజు కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ఏకంగా నాలుగోసారి!

విరాట్ కోహ్లీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా నాలుగోసారి ఈ గౌరవాన్ని దక్కించుకున్నాడు కింగ్ కోహ్లీ.

విరాట్ కోహ్లీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా నాలుగోసారి ఈ గౌరవాన్ని దక్కించుకున్నాడు కింగ్ కోహ్లీ.

Virat Kohli: రికార్డుల రారాజు కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ఏకంగా నాలుగోసారి!

విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్ కు పర్యాయపదంగా మారిన ఆటగాడు. తన బ్యాట్ తో వరల్డ్ క్రికెట్ ను ఏకఛత్రాధిపత్యం కింద పాలిస్తున్నాడు. ఇక తాను సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మ్యాచ్ ఆడితే చాలు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. ఉంటాడు ఈ రన్ మెషిన్. అయితే ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ కు దూరం అయ్యాడు ఈ స్టార్ బ్యాటర్. ఇదిలా ఉండగా.. తాజాగా విరాట్ కోహ్లీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. స్టార్ క్రికెటర్లను కాదని ఏకంగా నాలుగోసారి ఈ గౌరవాన్ని దక్కించుకున్నాడు కింగ్ కోహ్లీ. మరి రికార్డుల రారాజు ఖాతాలో చేరిన ఆ మరో రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.

విరాట్ కోహ్లీ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. దిగ్గజ క్రికెటర్లు సాధించలేని రికార్డులను సైతం అలవోకగా సాధిస్తూ.. క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలను లిఖించుకుంటూ ముందుకుసాగుతున్నాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. 2023 సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఏకంగా నాలుగోసారి దక్కించుకున్నాడు కింగ్ కోహ్లీ. దీంతో విరాట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా ప్రకటించిన ఐసీసీ అవార్డుల్లో వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును దక్కించుకున్నాడు కోహ్లీ. 2023 సంవత్సరంలో కోహ్లీ అద్భుతమైన ఫామ్ ను చూపించాడు. తాజాగా జరిగిన వన్డే ప్రపంచ కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మెగాటోర్నీలో 95.62 స్ట్రైక్ రేట్ తో 765 పరుగులు సాధించాడు. ఇక ఈ ఏడాదిలో 27 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 1377 రన్స్ చేయడమే కాకుండా.. ఓ వికెట్ తో పాటుగా 12 క్యాచ్ లు అందుకున్నాడు. ఇక ఈ అవార్డును రికార్డు స్థాయిలో 4 సారి కైవసం చేసుకుని ఔరా అనిపించాడు కింగ్. మరి రికార్డుల రారాజు అయిన కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి