iDreamPost

ప్రపంచ కప్ కోసం కోహ్లీ స్పెషల్ డైట్.. విరాట్ ఏమేం తింటున్నాడంటే..?

  • Author singhj Published - 09:12 PM, Fri - 27 October 23

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరల్డ్ కప్​ కోసం స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నాడట. అతడి ఫుడ్ మెనూలో ఏమేం ఐటమ్స్ ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరల్డ్ కప్​ కోసం స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నాడట. అతడి ఫుడ్ మెనూలో ఏమేం ఐటమ్స్ ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 09:12 PM, Fri - 27 October 23
ప్రపంచ కప్ కోసం కోహ్లీ స్పెషల్ డైట్.. విరాట్ ఏమేం తింటున్నాడంటే..?

వన్డే ప్రపంచ కప్-2023లో టీమిండియా జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. వరుస విజయాలతో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది రోహిత్ సేన. అడ్డొచ్చిన ప్రతి టీమ్​ను చిత్తు చిత్తుగా ఓడిస్తూ ఈసారి కప్పు మనదే అంటూ దూసుకెళ్తోంది భారత జట్టు. టీమిండియా విజయాల్లో బౌలర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా విరాట్ అయితే టీమ్ కష్టాల్లో ఉన్న ప్రతిసారీ మరింత రెస్పాన్సిబిలిటీతో ఆడుతున్నాడు. మ్యాచ్ పూర్తయ్యే వరకు క్రీజులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే రోహిత్ సేనను ఆపడం ఎవరి తరం కావడం లేదు.

ఆసియా కప్​ ఫామ్​నే వరల్డ్ కప్​లోనూ కంటిన్యూ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ. వరుసగా అద్భుతమైన నాక్స్ ఆడుతూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నాడు. అలాంటి అతడు మెగా టోర్నీ కోసం స్పెషల్​గా ప్రిపేర్ అయ్యాడట. వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా ఒక డైట్​ను కూడా ఫాలో అవుతున్నాడట. మంచి డైట్ తీసుకుంటూ ఫిట్​నెస్​ను కాపాడుకుంటున్నాడట. ఈ విషయాన్ని భారత టీమ్ బస చేసిన లీలా ప్యాలెస్ హోటల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ అన్షుమాన్ బాలి నేషనల్ మీడియాకు వెల్లడించారు.

కోహ్లీ వరల్డ్ కప్ మెనూలో నాన్​వెజ్ లేదని అన్షుమాన్ బాలి తెలిపారు. విరాట్ ప్రస్తుతం మాంసాహారం తినడం లేదట. అతడు ఎక్కువగా ఉడకబెట్టిన ఫుడ్ తీసుకునేందుకు ఇష్టపడుతున్నాడట. కూరగాయలతో చేసిన డిమ్​సుమ్ అనే చైనీస్ డిష్​తో పాటు ప్రొటీన్స్ కోసం మాక్ మీట్, టోపు లాంటివి తింటున్నాడని సమాచారం. వీలైనంత తక్కువగా మిల్క్ ప్రాడక్ట్స్​ను కోహ్లీ తీసుకుంటున్నట్లు బాలి చెప్పారని తెలుస్తోంది. ఇక, టీమిండియా ప్లేయర్లు రాగి దోశను చాలా ఇష్టంగా తింటున్నారట. తమ హోటల్​లో మిల్లెట్స్​తో చేసిన ఇడ్లీలు, క్వినోవాతో చేసిన ఇడ్లీలు కూడా అందుబాటులో ఉంచామని బాలి చెప్పారట. మరి.. కోహ్లీ స్పెషల్ డైట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ధోని, దాదా కాదు.. వన్డేల్లో బెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మే.. ఇదిగో ప్రూఫ్​!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి