iDreamPost

Virat Kohli: కోహ్లీ గొప్ప మనసు.. బుమ్రాకి క్షమాపణలు! ఆలస్యంగా వెలుగులోకి!

టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. కోహ్లీ అతడికి ఎందుకు సారీ చెప్పాడు? అంటూ ఆరా తీస్తున్నారు నెటిజన్స్.

టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. కోహ్లీ అతడికి ఎందుకు సారీ చెప్పాడు? అంటూ ఆరా తీస్తున్నారు నెటిజన్స్.

Virat Kohli: కోహ్లీ గొప్ప మనసు.. బుమ్రాకి క్షమాపణలు! ఆలస్యంగా వెలుగులోకి!

దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గి.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయాలనుకున్న టీమిండియాకు భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి పోరులో భారత జట్టును ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో చిత్తు చేసింది సఫారీ టీమ్. అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగుచూసింది. అదేంటంటే? టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. కోహ్లీ అతడికి ఎందుకు సారీ చెప్పాడు? అంటూ ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్ లో రికార్డులను కొల్లగొట్టడమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానుల హృదయాలను కూడా కొల్లగొడుతూ ఉంటాడు. తన బ్యాటింగ్ తో పాటు, మంచి మనసుతో ప్రేక్షకుల మన్ననలు పొందుతుంటాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే? ఇటీవల సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 32 రన్స్ తేడాతో పరాజయం చవిచూసింది.

కాగా.. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.  31వ ఓవర్ వేయడానికి వచ్చాడు సఫారీ పేసర్ రబాడ. ఈ ఓవర్ 2వ బంతిని కోహ్లీ డిఫెన్స్ చేశాడు. పరుగుకు రమ్మని నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బుమ్రాకు మూమెంట్ ఇచ్చాడు. దాంతో లేని రన్ కోసం బుమ్రా ప్రయత్నించి డీన్ ఎల్గర్ వేసిన త్రోకు డకౌట్ గా రనౌట్ అయ్యాడు. దీంతో తీవ్ర నిరాశగా పెవిలియన్ వైపు వెళ్లాడు బుమ్రా. తనవల్లే అనవసరంగా బుమ్రా రనౌట్ అయ్యాడని భావించిన కోహ్లీ, ఎలాంటి మెుహమాటం లేకుండా మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. కోహ్లీ గొప్ప మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. అందుకే నిన్ను కింగ్ అనేది విరాట్ భాయ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చివరిదైన రెండో టెస్ట్ జనవరి 3న కేప్ టౌన్ వేదికగా ప్రారంభం కానుంది. మరి బుమ్రాకు విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి