iDreamPost

Viral video: ఇదేందయ్యో..ఒకే సారి, ఒకే బోర్డుపై రెండు సబ్జెక్టుల పాఠాల బోధన..

Viral video: ఇదేందయ్యో..ఒకే సారి, ఒకే బోర్డుపై రెండు సబ్జెక్టుల పాఠాల బోధన..

స్కూల్ అయినా..కాలేజీ అయినా ఆయా సబ్జెక్టులు ఆయా పిరియడ్స్ లో బోధిస్తుంటారు మాస్టార్లు. కానీ ఒకే క్లాసులో ఒకేసారి రెండు సబ్జెక్టుల్ని చెప్పటం రాయటం విన్నారా? బహుశా అలా ఎక్కడా ఉండదు. అలా చస్తే ఏ సబ్జెక్టు ఎవ్వరికి అర్థం కాదు. పోనీ కనీసం పాఠాలు బోధించేవారికైనా ఆ క్లారిటీ ఉంటుందా? అంటే కాస్త ఆలోచించాల్సిందే. అటువంటిది ఇక విద్యార్ధులకు ఏమి అర్థం అవుతుంది చెప్పండి..కానీ పాపం కానీ బీహార్ రాష్ట్రం కతిహార్ లో ఓ స్కూల్ లో అలాగే జరుగుతోంది.ఒకేసారి ఒకే బోర్డుమీద ఉర్దూ, హిందీ పాఠాల బోధన చేస్తున్నారు ఆయా భాషలో టీచర్లు. దీంతో విద్యార్ధులు ఏ భాష పాఠం కూడా అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. వినటానికి మనకే గందరగోళంగా ఉంటే ఇక వినే ఆ విద్యార్ధుల పరిస్థితి ఎలా ఉంటుంది పాపం..ఇలా ఒకరోజు రెండు రోజుకాదు ప్రతీ రోజు అలాగే ఉండటంతో పాపం విద్యార్ధుల పాట్లు అన్ని ఇన్నీ కావు..

బీహార్ రాష్ట్రం కతిహార్ లోని ఆదర్శ్ మిడిల్ స్కూల్ లో ఈ వింత రోజూ జరుగుతుంది. ఇద్దరు టీచర్లు ఒకే క్లాస్ రూంలో ఒకే బోర్డుపై ఎవరి పాఠం వాళ్లు చెబుతారు. విద్యార్థులు ఎవరు చెప్పేది వినాలో తెలియక వారిపనిలో వారు పడి ఉంటారు. అంతేకాదు అయితే ఇక్కడ మరో వింత కూడా ఉందండోయ్.. ఉపాధ్యాయులు బ్లాక్ బోర్డుపై ఎవరి పాఠాలు వారు చెబుతుంటే విద్యార్థులను అల్లరి చేయకుండా చూసేందుకు ప్రిన్సిపల్ ఓ చైర్ వేసుకొని అక్కడే ఉంటారు. ఆ సమయంలో విద్యార్థులను కంట్రోల్ చేసేందుకు స్కూల్ ప్రిన్సిపాల్ పడే కష్టాలు అన్నీఇన్నీకావు.

ఒకే బోర్డుపై.. ఒకే సమయంలో ఇద్దరు ఉపాధ్యాయులు వేరువేరు సబ్జెక్టుల పాఠాలు బోధించడం వెనుక ఓ కారణం ఉంది. 2017లో ఉర్దూ ప్రాథమిక పాఠశాలను, అక్కడ ప్రభుత్వ స్కూల్లోకి షిప్ట్ చేశారు. అయితే ఆ పాఠశాలలో తగినన్ని తరగతి గదులు, బ్లాక్ బోర్డులు లేవు. అందుకే చేసేదేమీ లేక అలా చేయాల్సి వస్తుందని అక్కడి ఉపాధ్యాయులు తెలిపారు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించారు. ఒకే తరగతి గదిలో ఒకే బ్లాక్ బోర్డుపై బోధించడం మంచిది కాదని, ఆదర్శ్ మిడిల్ స్కూల్ లో విద్యార్థుల నమోదు ఆధారంగా ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు ఒక క్లాస్ రూమ్ కేటాయిస్తామని డీఈవో తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి