iDreamPost

నగరాన్ని ముంచేసిన దోమల తుపాను.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

viral Video Of Mosquito Tornado: ఒక రూమ్ లో నాలుగు దోమలు ఉంటేనే తెగ ఇబ్బంది పడతాం. కానీ, ఇక్కడ చూడండి దోమల తుపాను చెలరేగింది.

viral Video Of Mosquito Tornado: ఒక రూమ్ లో నాలుగు దోమలు ఉంటేనే తెగ ఇబ్బంది పడతాం. కానీ, ఇక్కడ చూడండి దోమల తుపాను చెలరేగింది.

నగరాన్ని ముంచేసిన దోమల తుపాను.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

సాధారణంగా సీజన్లలో మార్పులు, కాలుష్యం కారణంగా దోమలు అంటు వ్యాధులను విస్తరిస్తూ ఉంటాయి. సాధారణంగానే దోమల బెడద ఎంతో ఎక్కువగా ఉంటుంది. అలాంటిది వాటికి అనుకూలించే సీజన్ అయితే ఇంక చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం దోమలకు అనుకూల సీజన్ కాకపోయినా నగరవాసులు ఒక అసాధారణ సంఘటను ఫేస్ చేశారు. భారత వైమానిక దళ నిపుణుడు X.కామ్ లో పంచుకున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో క్యూరియాసిటీ పెంచడమే కాకుండా, తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. మరి.. ఆ వీడియో ఏంటి? ఎందుకు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో చూద్దాం.

అసలు విషయం ఏంటంటే.. పూణేలోని ముఠా నదిపై ఊహించని రీతిలో దోమల స్వైర విహారం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. పూణేలోని కేశవనగర్, ఖరాడి ప్రాంతాల్లో ఈ షాకింగ్ విజువల్స్ దర్శనమిచ్చాయి. ఆ దృశ్యాల్లో ఏముందంటే.. ఆ ప్రాంతంలోని వివిధ భవన సముదాయాల మీదుగా వెళుతున్నప్పుడు భారీ సంఖ్యలో దోమలు ఆకాశంలో మైక్రో టోర్నడోలను పోలి ఉండటం గమనించారు. అందుకు సంబంధించి చాలానే విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దూరం నుంచి చూస్తుంటే భవనమాల మీద ఇసుక తుపాను చెలరేగిన భావన కలుగుతోంది. కాసేపు అక్కడ ఉన్న వారికి ఏం జరుగుతోంది కూడా అర్థం కాలేదు.

ఆ దోమల బెడదకు కారణం మూలా-ముఠా నది నీటి మట్టాలు పెరగడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అందుకే పూణే మున్సిపల్ కార్పొరేషన్(PMC).. స్థానికులు, నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇలా దోమలు పెరిగిపోతే.. వ్యాధులు వ్యాప్తి చెందుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల నుంచి నదిలో అదనపు నీటిని తొలగించడానికి PMC పని చేస్తున్నా కూడా.. పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదని స్థానికులు వాపోతున్నారు. గతకొన్ని దశాబ్దాలుగా భారీ పట్టణీకరణ కారణంగా పూణేలో మూల- ముఠా నదులు చాలా ఒత్తిడికి గురవుతున్నాయి. శుద్ధి చేయని మురుగు నీరు నదుల్లోకి ప్రవహించడం, చెత్త డంపింగ్, నిర్మాణ శిథిలాలు విసిరివేయడం, వరదల తాకిడి, అక్రమ నిర్మాణాలు ఈ సమస్యకి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఇప్పటికైనా PMC నదీ జలాలకు సంబంధించి తక్షణమే శ్రద్ధ వహించకపోతే శాశ్వత పరిష్కారంలేని సమ్యస్యగా ఇది మారనున్నట్లు పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచ ఆరోగ్య సంస్థను సైతం ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇది భవిష్యత్తులో పెద్ద, మరింత తీవ్రమైన దుష్ప్రభావాలకు దారితీస్తుందేమో అంటూ భయాందోళన గురిచేస్తోంది. కేంద్ర జలవనరులు, నదుల అభివృద్ధి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గతంలో చేసిన ప్రకటన ప్రకారం, మూల- ముఠా నదుల పునరుజ్జీవన ప్రాజెక్ట్ కోసం సుమారు రూ.1,450 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆ పనులు 2025 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. మరి.. పూణే వాసులను బెంబేలెత్తిస్తున్న ఈ దోమల తుపాను వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి