iDreamPost
android-app
ios-app

విజయ్ వారసుడు స్టోరీ లీక్స్

  • Published Jun 22, 2022 | 3:58 PM Updated Updated Jun 22, 2022 | 3:58 PM
  • Published Jun 22, 2022 | 3:58 PMUpdated Jun 22, 2022 | 3:58 PM
విజయ్ వారసుడు స్టోరీ లీక్స్

ఇవాళ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని కొత్త సినిమా పేరు వారసుడుతో పాటు రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేశారు. నాగార్జున సూపర్ హిట్ టైటిల్ ని వాడేసుకున్న విజయ్ ని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్, దానికి కారణం లేకపోలేదు. ఈ వారసుడికి దర్శకుడు వంశీ పైడిపల్లి. మహేష్ బాబు మహర్షి తర్వాత చాలా గ్యాప్ వచ్చిన ఇతను ఈ చిత్రాన్ని కూడా తన రెగ్యులర్ స్టైల్ లోనే తీస్తున్నాడనే కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి లైన్ కు దగ్గరగా అనిపిస్తోందని పోస్టర్ లో పెట్టిన ట్యాగ్ లైన్ ని బట్టి రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అఫ్కోర్స్ కౌంటర్లు వస్తున్నాయిలెండి.

నిజానికి విజయ్ కొన్నేళ్లుగా ఒకరకమైన మూసలో పడిపోయాడు. ఏది చూసినా వైవిధ్యం ఉండటం లేదు. తేరి, మెర్సల్, బిగిల్, మాస్టర్ అన్నీ కేవలం ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచేందుకు తప్ప గొప్పగా చెప్పుకునేవి లేవనిపించేలా సాగాయి. తుపాకీ తర్వాత ఆ స్థాయి మూవీ రాలేదన్నది వాస్తవం. అందుకే బీస్ట్ లో మరీ బిలో యావరేజ్ కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. డాక్టర్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు నెల్సన్ కూడా విజయ్ ని సరిగా డీల్ చేయలేకపోయాడు. అందుకే ఇప్పుడా ఒత్తిడంతా వంశీ పైడిపల్లి మీద ఉంది. దాంతో ఎక్కువ రిస్క్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడేందుకే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది.

వారసుడుకి సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ అప్ డేట్ స్టోరీ లైన్. విడిపోయిన రెండు కుటుంబాలను కలిపేందుకు ఎప్పుడో వెళ్ళిపోయిన హీరో తిరిగి ఇంటికి రావడమనే పాయింట్ తో ఇది రాసుకున్నారట. చూస్తే అతడు, వారసుడొచ్చాడు లాంటి ఎన్నో సూపర్ హిట్ల ఛాయలు కనిపిస్తున్నాయి. అయితే ఇవి ఎంత వరకు నిజమనేది రిలీజయ్యాకే తెలుస్తుంది. దిల్ రాజుకి ఈ వారసుడు మొదటి తమిళ సినిమా. అందుకే ఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే వందల కోట్ల బడ్జెట్ లేకపోయినా ఆర్టిస్టుల రెమ్యునరేషన్లకే తడిసి మోపెడయ్యేలా ఉంది. రష్మిక మందన్నతో సహా సౌత్ లోని బిజీ ఆర్టిస్టులందరూ ఇందులో ఉన్నారు

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet