iDreamPost

విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా ఆ డైరెక్టర్ తో?

  • Published Mar 20, 2024 | 11:21 AMUpdated Mar 20, 2024 | 11:21 AM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుంది. కాగా ఈ సినిమా కంటే ముందే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో కూడా ఒప్పుకున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్లు పూర్తయిన తర్వాత గౌతమ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుంది. కాగా ఈ సినిమా కంటే ముందే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో కూడా ఒప్పుకున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్లు పూర్తయిన తర్వాత గౌతమ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.

  • Published Mar 20, 2024 | 11:21 AMUpdated Mar 20, 2024 | 11:21 AM
విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా ఆ డైరెక్టర్ తో?

యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుంది. కాగా ఈ సినిమా కంటే ముందే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో కూడా ఒప్పుకున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్లు పూర్తయిన తర్వాత గౌతమ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఇంతకీ విషయం ఏంటంటే… ఈ రెండింటి తర్వాత విజయ్ దేవరకొండ ఇటీవలే రాజా వారు రాణి గారు, అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమలతో మంచి విజయాన్ని అందుకుని గుర్తింపు పొందిన రవి కిరణ్ కోలాతో తన తదుపరి సినిమా చేయనున్నారని టాక్ నడుస్తోంది.

ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక కథ విషయానికి వస్తే పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే గ్రామీణ యాక్షన్ చిత్రం అంటున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇదొక స్పెషల్ సినిమాగా ఉండనుందని అంటున్నారు. ఈ మధ్య రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాలు ఎక్కువగా హిట్ అవుతున్నాయి. ఆ రకంగా చూసుకుంటే ఈ సినిమా సక్సెస్ అవడానికే ఎక్కువ అవకాశం ఉందని చెప్పవచ్చు.

Vijay devarakonda next with ravi kiran kola

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, ఆ తరువాత గీత గోవిందం సినిమాతో తన ఇమేజ్ ను మరింత పరుచుకున్నారు. ఇటీవల లైగర్ నిరాశపరిచినా, ఖుషి తో డీసెంట్ సక్సెస్ అందుకున్నారు. మృణాల్ ఠాకూర్ తో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఈ సమ్మర్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించేందుకు ఉత్సాహంగా ఉన్నారు. మరి మంచి ఫీల్ గుడ్ సినిమాలు తీయగలరన్న రవి కిరణ్ కోలాతో విజయ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉంటాయి. మరి త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన ప్రకటన వచ్చి అభిమానులని అలరిస్తుందని ఆశిద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి