iDreamPost

DJ Tillu : అదరగొడుతున్న చిన్న సినిమా కలెక్షన్లు

DJ Tillu : అదరగొడుతున్న చిన్న సినిమా కలెక్షన్లు

మొన్న శనివారం విడుదలైన డీజే టిల్లు సౌండ్ బాక్సాఫీస్ వద్ద మాములుగా లేదు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద రేంజ్ లో వసూళ్లు రాబడుతున్న తీరు డిస్ట్రిబ్యూటర్లను ఆనందంలో ముంచెత్తుతోంది. ముఖ్యంగా ఏ సెంటర్లలో దీని రచ్చ పీక్స్ లో ఉంది. నిన్నంతా హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లు కళకళలడాయి. ఖిలాడీ నెగటివ్ టాక్ టిల్లుకు చాలా ప్లస్ అయ్యింది. మొదటి రోజే 4 కోట్ల పైగా షేర్ రావడం చిన్న విషయం కాదు. ఒక్కోసారి మార్కెట్ ఉన్న మీడియం రేంజ్ స్టార్లకే ఇది అంత సులభం కాదు. అలాంటిది సిద్దు జొన్నలగడ్డ లాంటి అప్ కమింగ్ హీరో ఈ ఫిగర్స్ నమోదు చేయడం చూస్తే రచ్చ ఏ రేంజ్ లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

నిన్న ఆదివారం దాదాపుగా డీజే టిల్లు కంట్రోల్ లోకి వెళ్లిపోయింది. చాలా చోట్ల ఖిలాడీ కన్నా ముందు ఈ సినిమాకే అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ కావడం గమనించాల్సిన అంశం. రెండో రోజు కూడా 3 కోట్ల దగ్గరగా షేర్ ఉంటుందని అంచనా. అంటే కేవలం మొదటివారం సగం దాటకుండానే పూర్తిగా బ్రేక్ ఈవెన్ దగ్గరికి వెళ్ళిపోయినట్టన్న మాట. ఇంత వేగంగా ఈ మధ్య కాలంలో ఏ సినిమా చేరుకోలేదు. బంగార్రాజు సైతం లాభాల్లోకి ప్రవేశించడానికి మూడు వారాలు పట్టింది. డీజే టిల్లు బడ్జెట్, థియేట్రికల్ బిజినెస్ చిన్నదే అయినా కూడా తొమ్మిది కోట్ల మొత్తమనేది ఒకరకంగా రిస్కే. అయినా కూడా ఇంత ఫాస్ట్ రికవరీ ఊహించనిది.

నైజామ్ – 3 కోట్లు
సీడెడ్ – 78 లక్షలు
ఉత్తరాంధ్ర – 48 లక్షలు
ఈస్ట్ గోదావరి – 30 లక్షలు
వెస్ట్ గోదావరి – 42 లక్షలు
గుంటూరు – 25 లక్షలు
కృష్ణా – 20 లక్షలు
నెల్లూరు – 17 లక్షలు

ఏపి/ తెలంగాణ 3 రోజుల షేర్ – 5 కోట్ల 60 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 40 లక్షలు
ఓవర్ సీస్ – 1 కోటి 25 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా వీకెండ్ షేర్ – 7 కోట్ల 5 లక్షలు

మొత్తానికి కొద్దిరోజులుగా డల్ గా ఉన్న బాక్సాఫీస్ కు డీజే టిల్లు మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. జనం థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న మెసేజ్ ఇచ్చాడు. దీనికే ఇంత ఉంటే ఏదైనా పెద్ద హీరో సినిమా వస్తే థియేటర్ల వద్ద జాతర ఖాయమనే క్లారిటీ వచ్చేసింది. నిర్మాతలు డేట్లు అనౌన్స్ చేయడమే ఆలస్యం. ఏపిలో ఆంక్షలు పూర్తిగా తీసేస్తే ప్రకటనలు ఇంకా వేగంగా వస్తాయి. బహుశా దానికి సంబంధించి ఈ రోజు క్లారిటీ రావొచ్చు. దేశం మొత్తం మీద తెలుగు ప్రేక్షకులు ఆదరించినంత ఇంకెక్కడా సినిమాలు చూడరని మరోసారి ఋజువయ్యింది. ఇండియా వైడ్ రిలీజైన బాలీవుడ్ మూవీ బధాయీ దో కంటే డీజే టిల్లు కలెక్షన్లు ఎక్కువ ఉండటం విశేషం

Also Read : Tollywood : ఈ శుక్రవారం చప్పగానే గడిచిపోనుందా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి