iDreamPost

నకిలీ మద్యానికి చెక్‌.. ఈ యాప్‌తో సింపుల్‌గా గుర్తించొచ్చు

  • Published Nov 04, 2023 | 3:59 PMUpdated Nov 04, 2023 | 3:59 PM

తెలంగాణలో ఎన్నికలు కావడంతో.. మద్యానికి భారీ డిమాండ్‌ ఉంటుందనేది అందరికి తెలిసిన సంగతే. ఇక ఇదే అదునుగా నకిలీ మద్యం తయారు చేసే కేటుగాళ్లు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఓ యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ వివరాలు..

ఈ కాలంలో నకిలీకి, ఒరిజనల్‌కు తేడా కనిపెట్టడం చాలా కష్టమవుతోంది. అసలు వాటికి ఏమాత్రం తగ్గకుండా.. ఒరిజినల్‌ అని పూర్తిగా నమ్మించేలా నకిలీ వస్తువులను తయారు చేసి జనాలకు అంటగడుతున్నారు. ప్రతి దానికి నకిలీని తయారు చేస్తున్నారు. రోగాలను తగ్గించే మందుల విషయంలో ఈ నకిలీ దందా ఎంతలా వేళ్లూనుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక నేటి కాలంలో నకిలీ మద్యం దందా బాగా పెరిగింది. ఏకంగా పేరు మోసిన బ్రాండ్లను టార్గెట్‌ చేసి.. నకిలీ వాటిని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సమయం కాబట్టి.. నకిలీ మద్యం మార్కెట్‌లోకి భారీగా వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఈ క్రమంలో ఎక్సైజ్‌ శాఖ.. నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆవివరాలు..

నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు గాను ప్రత్యేక యాప్‌ను తయారు చేసినట్లు నారాయణగూడ ఎక్సైజ్‌ సీఐ గీత తెలిపారు. ‘వేరిట్’ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా మద్యం బాటిల్‌ తెలంగాణకు చెందినదా.. కాదా.. ఒరిజినలా.. నకిలీనా అనే విషయం తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందన్నారు. దీన్ని ఎలా ఉపయోగించాలో కూడా ఆమె వివరించారు. ‘వేరిట్‌’యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత.. మద్యం బాటిల్‌పై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలి. అప్పుడు అది ఏ రాష్ట్రానికి చెందిన లిక్కరో ఇట్టే తెలిసిపోతుందన్నారు.

అంతేకాక ఆ మద్యం బాటిల్‌ ఒరిజినలా.. నకిలీనా అనే విషయం కూడా వెంటనే నిర్ధారణ చేసుకోవచ్చు అని వెల్లడించారు. ఇక, ఎన్నికల సమయంలో.. మద్యం పంపిణీ, అక్రమ మద్యం నిల్వలపై సమాచారం అందించినా.. తెలిసినా.. వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దాని కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-2523కు కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు ఎక్సైజ్ సీఐ గీత.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి