iDreamPost

వెన్నెల కిషోర్ హీరోగా ‘చారి 111’.. రిలీజ్ ఎప్పుడంటే?

Vennela Kishore Chaari111 Movie: టాలీవుడ్ లో తనదైన కామెడీ మార్క్ చాటుకుంటున్న కమెడియన్ వెన్నెల కిషోర్.. సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Vennela Kishore Chaari111 Movie: టాలీవుడ్ లో తనదైన కామెడీ మార్క్ చాటుకుంటున్న కమెడియన్ వెన్నెల కిషోర్.. సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

వెన్నెల కిషోర్ హీరోగా ‘చారి 111’.. రిలీజ్ ఎప్పుడంటే?

సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ కమెడియన్లు హీరోగాలు మారారు. కొంతమందికి కమెడియన్లకు సక్సెస్ కలిసి వచ్చింది.. మరికొంతమందికి రాలేదు. తెలుగు ఇండస్ట్రీలో రాజబాబు, పద్మనాభం, బ్రహ్మానందం, ఆలీ, సునీల్ ఇలా పలువురు కమెడియన్లు హీరోలుగా నటించారు. హీరోలుగా పెద్దగా సక్సెస్ కలిసి రాకపోవడంతో కమెడియన్లుగానే కొనసాగారు.ఈ మధ్య కాలంలో శకలక శంకర్, సప్తగిరి లాంటి కమెడియన్లు హీరోలుగా నటించారు. మళ్లీ ఇప్పుడు కమెడియన్లుగా కొనసాగుతున్నారు. టాలీవుడ్ లో తన మేనరీజంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ వెన్నెల కిషోర్… సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా తనదైన మార్క్ చాటుకుంటున్న వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 2005లో ‘వెన్నెల’ చిత్రంతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘కరెంట్’ చిత్రంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అప్పటి నుంచి వెన్నెల కిషోర్ కి వరుస ఛాన్సులు వచ్చాయి. వెన్నెల మూవీ టైటిల్ తన పేరు ముందు చేర్చుకున్నాడు. ఇండస్ట్రీలో వెన్నెల కిషోర్ నటించే సినిమాలు చాలా వరకు హిట్ గా నిలిచాయి. గతంలో కమెడియన్ల మాదిరిగానే ఇప్పుడు వెన్నెల కిషోర్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో ‘చారి 111’ మూవీతో వెన్నెల కిషోర్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. వెన్నెల కిషోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ నటిస్తుంది.. ఓ ముఖ్యపాత్రలో మురళీ శర్మ నటిస్తున్నారు.

గతంలో సుమంత్ హీరోగా ‘మళ్లీ మొదలైంది’ లాంటి ఫీల్ గుడ్ మూవీని అందించారు టీజీ. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించారు. ఈ చిత్రం మార్చి1న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేలా ‘చారి 111’ రిలీజ్ డేట్ పోస్టర్ డిజైన్ చేశారు.  ఈ మూవీలో సరికొత్త వెన్నెల కిషోర్ ని చూస్తారని.. కన్ ఫ్యూజ్ అయ్యే గూఢాచారిగా ‘చారి’ పాత్రలో వెన్నెల కిషోర్ కనిపిస్తారని దర్శక నిర్మాతలు తెలిపారు. అంతేకాదు ఈ మూవీలో వెన్నెల కిషోర్ కామెడీకి థియేటర్లో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారని అన్నారు. ఇదొక యాక్షన్ కామెడీ మూవీ.. చిన్న చిన్న తప్పులు చేసే ఒక స్పై పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడు అన్నదే చిత్ర కథ అన్నారు. ఈ జనరేషన్ కమెడియన్లలో వెన్నెల కిషోర్ కి ప్రత్యేక స్థానం ఉంది.. మరి హీరోగా ఎంత వరకు సక్సెస్ సాధిస్తాడో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి