iDreamPost

వెంకీమామ సేఫయ్యాడు – ముగింపు వసూళ్లు

వెంకీమామ సేఫయ్యాడు – ముగింపు వసూళ్లు

విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన వెంకీ మామ ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది. సంక్రాంతి సినిమాల రాక సందర్భంగా ముందే ఈ విషయం డిసైడ్ అయినప్పటికీ డిసెంబర్ రెండో వారంలోనే రిలీజ్ కావడం వెంకీ మామకు బాగా కలిసి వచ్చింది. 2019లో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ ఎఫ్2తో పోల్చుకునే స్థాయి వెంకీ మామకు లేనప్పటికీ వచ్చిన డివైడ్ టాక్ తో పోల్చుకుంటే చాలా మెరుగ్గానే వసూళ్లు సాధించాడు. 35 కోట్ల 65 లక్షల షేర్ తో బిజినెస్ లెక్కల్లో చెప్పాలంటే వెంకీ మామ హిట్ స్టాంప్ వేయించుకున్నాడు.

పల్లెటూరిలో ఉండే మేనమామ అల్లుళ్ళ మధ్య అనుబంధాన్ని దర్శకుడు బాబీ చూపించిన తీరుకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. మిలిటరీ బ్యాక్ డ్రాప్ అసలు కథకు పెద్దగా సింక్ కానప్పటికీ మాస్ ని మెప్పించే అంశాలు ఉండటంతో వెంకీ మామ సేఫ్ గా బయట పడ్డాడు. ధియేటర్లలో విడుదలైన నెల రోజులకే అమెజాన్ ప్రైమ్ లో ఒరిజినల్ వెర్షన్ వచ్చేయడంతో ఇక ఆపై కొనసాగే అవకాశాలు వెంకీ మామకు పూర్తిగా క్లోజయ్యాయి. మొత్తం వెంకటేష్ నాగ చైతన్యలు చేరి రెండు హిట్లతో 2019కు ఫేర్ వెల్ చెప్పారు. వెంకీకి దీంతో పాటు ఎఫ్2 ఖాతాలో ఉండగా చైతుకు మజిలి రూపంలో మరో పెద్ద హిట్ దక్కింది. బిజినెస్ కూడా రీజనబుల్ గా చేయడంతో బయ్యర్లు కూడా వెంకీ మామ ఫైనల్ కలెక్షన్స్ పట్ల సంతృప్తిగా ఉన్నారు.

ఏరియా వారి ఫుల్ రన్ కలెక్షన్స్ వివరాలు 

ఏరియా  షేర్ 
నైజాం  11.30cr
సీడెడ్   4.25cr
ఉత్తరాంధ్ర  4.00cr
గుంటూరు   2.30cr
కృష్ణ   1.80cr
ఈస్ట్ గోదావరి  2.45cr
వెస్ట్ గోదావరి  1.55cr
నెల్లూరు   1.05cr
మొత్తం Ap/Tg 28.70cr
కర్ణాటక + రెస్ట్ అఫ్ ఇండియా 3.70cr
ఓవర్సీస్ 3.25cr
ప్రపంచవ్యాప్తంగా 35.65cr

Verdict – హిట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి