iDreamPost

Veede : గ్రామం కోసం నగరంలో పోరాడిన యువకుడు – Nostalgia

Veede : గ్రామం కోసం నగరంలో పోరాడిన యువకుడు – Nostalgia

కెరీర్ లో గర్వంగా చెప్పుకునే మొదటి బ్లాక్ బస్టర్ వచ్చాక ఏ హీరో అయినా కమర్షియల్ సబ్జెక్టు ట్రై చేయడం మాములే. ఖైదీ వచ్చాకే చిరంజీవి మాస్ వైపు మొగ్గారు. ఒక్కడుతోనే మహేష్ బాబుకు ఆ సెక్షన్ లో ఉన్న పవర్ తెలిసొచ్చింది. మంగమ్మ గారి మనవడు బాలయ్యని ఆ వర్గానికి ఎంత చేరువ చేసిందో అందరికీ గుర్తే. వరస ఫ్లాపులతో సతమతమవుతున్న టైంలో నాగార్జునకు హిట్ వచ్చేలా చేసింది అల్లరి అల్లుడు, వారసుడు లాంటి మాస్ ఎంటర్ టైనర్లే. 2002లో ఇడియట్ రూపంలో రవితేజకు ఆశించిన దానికన్నా పెద్ద బ్రేక్ దక్కినప్పుడు తనూ ఇలాంటి ఆలోచనే చేశాడు. ఎప్పుడూ సాఫ్ట్ టచ్ ఉన్నవి చేయడం వల్ల మార్కెట్ వేగంగా పెరగని గుర్తించాడు.

దానికి తగ్గట్టే ఈ అబ్బాయి చాలా మంచోడు, ఒక రాజు ఒక రాణి ఫ్లాపవ్వడంతో మంచి మాస్ కథ కోసం చూస్తున్న టైం అది. నిర్మాత కెఎస్ రామారావుగారు 2003లో తమిళ్ లో ఘన విజయం సాధించిన విక్రమ్ ధూల్ రీమేక్ ప్రతిపాదన తీసుకొచ్చారు. ధరణి దర్శకత్వంలో 7 కోట్ల బడ్జెట్ తో నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తే దానికి రెట్టింపు లాభాలు ఇచ్చింది. తెలుగులోనూ ఇది బాగా ఆడుతుందన్న నమ్మకంతో రామారావు ఆలస్యం చేయకుండా హక్కులు కొన్నారు. దర్శకుడిగా రవిరాజా పినిశెట్టిని ఫిక్స్ చేసుకున్నారు.ఇదే నిర్మాతతో ఆయనకు చంటి లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. రవితేజకు 90 దశకం ప్రారంభంలో చిన్న వేషాలు ఇచ్చి ప్రోత్సహించింది రవిరాజానే.

అందుకే పేరు వినగానే ఆలస్యం చేయకుండా మాస్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆర్తి అగర్వాల్-రీమా సేన్లు హీరోయిన్లుగా ఒరిజినల్ వెర్షన్ లో నటించిన పశుపతి, తెలంగాణ శకుంతల, షియాజీ షిండేలకు అవే పాత్రలు ఇచ్చారు. చక్రి సంగీతం అందించగా కోన వెంకట్ సంభాషణలు సమకూర్చారు. చదువురాని ఓ యువకుడు గ్రామ సమస్యల కోసం నగరానికి వచ్చి అక్కడి రాజకీయ వ్యవస్థకు రౌడీలకు సవాల్ గా మారడమనే పాయింట్ తో ఈ సినిమా రూపొందింది. అన్ని అంశాలు పుష్కలంగా ఉన్న వీడే ఇక్కడ ధూల్ అంత రేంజ్ కు వెళ్లలేకపోయింది కానీ రవితేజలోని రియల్ మాస్ యాంగిల్ ని పర్ఫెక్ట్ గా ఆవిష్కరించింది. పాటలు క్లిక్ అయ్యాయి. 2003 అక్టోబర్ 31 విడుదలైన వీడే వారం ముందు వచ్చిన నాగార్జున శివమణి పోటీని తట్టుకుని కమర్షియల్ గా సేఫ్ అయ్యింది

Also Read : Bhakta Kannappa : రెబెల్ స్టార్ విశ్వరూప నటన – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి