iDreamPost
android-app
ios-app

సరికొత్త రికార్డు సృష్టించిన వందేభారత్ రైళ్లు! ఆ రికార్డు ఏంటంటే..?

Vande Bharat: భారత రైల్వే వ్యవస్థ అనేక సౌకర్యాలను అందిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంది. అలానే స్వదేశీయ పరిజ్ఞానంతో వివిధ రకాల రైళ్లను తయారు చేస్తుంది. అలాంటి వాటిల్లో ఒకటే వందే భారత్  రైళ్లు.

Vande Bharat: భారత రైల్వే వ్యవస్థ అనేక సౌకర్యాలను అందిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంది. అలానే స్వదేశీయ పరిజ్ఞానంతో వివిధ రకాల రైళ్లను తయారు చేస్తుంది. అలాంటి వాటిల్లో ఒకటే వందే భారత్  రైళ్లు.

సరికొత్త రికార్డు సృష్టించిన వందేభారత్ రైళ్లు! ఆ రికార్డు ఏంటంటే..?

వందే భారత్ రైళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో అధునాత సౌకర్యాలయతో ప్రారంభమైన ఈ రైళ్లు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పరుగులు పెడుతున్నాయి. రైల్వే ఆధునికీకరణలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైళ్లు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాక వందే భారత్ ట్రైన్లు రైల్వే వ్యవస్థలో పెను మార్పులకు కారణమయ్యాయి. ఇది ఇలా ఉంటే..తాజాగా ఈ వందేభారత్ రైళ్లు అరుదైన రికార్డును సృష్టించింది. మరి.. ఆ రికార్డు ఏమిటో, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

భారత రైల్వే వ్యవస్థ అనేక సౌకర్యాలను అందిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంది. అలానే స్వదేశీయ పరిజ్ఞానంతో వివిధ రకాల రైళ్లను తయారు చేస్తుంది. అలాంటి వాటిల్లో ఒకటే వందే భారత్  రైళ్లు.  ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ రైలు పరుగులు తీస్తుంది. అలానే వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 400 వందేభారత్ రైళ్లు తిప్పాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు ఆ రైళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. రాత్రి వేళ తిరిగే స్లీపర్ వందేభారత్ ట్రైన్లను కూడా పట్టాలు ఎక్కించనున్నారు. ఇవి కూడా అందుబాటులోకి వస్తే రైల్వే ప్రయాణికులకు జర్నీ మరింత సౌకర్యవంతంగా  ఉంటుంది.

ఇక ఈ సంగతులు పక్కన పెడితే.. వందే భారత్ రైళ్లు అరుదైన , సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.  ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా అన్ని వందేభారత్ రైళ్లు 18,423 త్రిపులు నడిచాయి. అదే విధంగా ఈ రైళ్లు ప్రయాణించిన దూరం కూడా రికార్డు స్థాయిలో ఉంది.  ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లు 1,24,87,540 కిలోమీటర్లు ప్రయాణించాయి. ఈ దూరం అనేది భూమి చుట్టూ  310 సార్లు పరిభ్రమించిన దూరంతో సమానమని రైల్వే శాఖ పేర్కొంది. ఇది సరికొత్త రికార్డు అని  ఇండియన్ రైల్వే శాఖ వెల్లడించింది. 2023 కాలంలో 97,71,705 కిలోమీటర్లు తిరిగినట్టు వెల్లడించింది. 2019 ఫిబ్రవరి 15న ఈ వందేభారత్ రైళ్లు ప్రారంభమైన సంగతి తెలిసింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 105.57 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్నాయి. వీటిలో కేరళలో తిరుగుతున్న వందేభారత్ రైలుకు అత్యంత డిమాండ్ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానిక వస్తే.. ప్రస్తుతం మొత్తం నాలుగు వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయి. గత ఏడాది సంక్రాంతికి 16 బోగీలతో సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైంది. ఈ రైలులో 120 శాతానికి మించి ఆక్యుపెన్సీ రేషియోతో ఉంది. అలానే కొద్ది నెలల క్రితం ఇదే రూట్లో మరో ట్రైన్ ను కూడా ప్రారంభించారు. అలానే సికింద్రాబాద్ – తిరుపతి,  కాచిగూడ – బెంగుళూరు మధ్య మరో రెండు వందే భారత్  పరుగులు పెడుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి