iDreamPost

వకీల్ సాబ్ కి భారీ పోటీ తప్పదు

వకీల్ సాబ్ కి భారీ పోటీ తప్పదు

కరోనా తాలూకు ప్రకంపనలు మాములుగా లేవు. రేపో మాపో సద్దుమణిగే పరిస్థితి కూడా కనిపించడం లేదు. చాలా టైం పట్టేలా ఉంది. ఒకవైపు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు జనం మదిలో సినిమా అన్న ఆలోచనే రావడం లేదు. అసలే రిలీజుల వాయిదాలు, షూటింగ్ పోస్ట్ పోన్ కావడాలు లాంటి పరిణామాలతో ఇండస్ట్రీ తీవ్ర నష్టాల వైపు వెళ్తోంది. మరోపక్క ఇప్పట్లో ప్రభుత్వాలు వాణిజ్య సముదాయాలు, థియేటర్లు ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చేలా లేదు.

కాబట్టి ఇంకో కాబట్టి నెల రెండు నెలల తర్వాత మొత్తం కుదుటపడ్డాక డేట్లను రీ షెడ్యూల్ చేయడం పెద్ద తలనొప్పి అయ్యేలా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మీద అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. అంతా సవ్యంగా ఉంటే మే 15 విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదు కాని ఇప్పుడు అది అంత ఈజీగా కనిపించడం లేదు. షూటింగ్ ఇంకా కొంత భాగం మాత్రమే బాలన్స్ ఉంది. కరోనా సెగలు తగ్గాక హీరొయిన్ శృతి హాసన్ తో తీయాల్సిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పూర్తవ్వగానే గుమ్మడి కాయ కొట్టేస్తారు. మాములుగా పవన్ సినిమా అంటే అంత ఈజీగా ఎవరు పోటీకి దిగరు.

కాని ఈ సారి అలా జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. భారీ పోటీ ఖాయమయ్యేలా ఉంది. నాని వితో మొదలుకుని నాగ చైతన్య లవ్ స్టొరీ దాకా అప్పటికే క్యులో చాలా సినిమాలు వెయిట్ చేస్తూ ఉంటాయి. వకీల్ సాబ్ రీమేక్ సినిమా అందులోనూ హింది తమిళ్ లో చాలా మంది చూసేశారు. కాబట్టి సబ్జెక్టు పరంగా అధిక శాతం ప్రేక్షకులకు అంత యాంగ్జైటీ ఏమి ఉండదు. అలాంటప్పుడు కొత్త కథలు ట్రై చేసిన వాటికి కాస్త ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మరో వకీల్ సాబ్ సోలోగా దిగే ఛాన్స్ దాదాపు లేనట్టే కనిపిస్తోంది కాని ఫేస్ టు ఫేస్ తలపడే పోటీ మూవీస్ ఏవో తేలాలంటే ఇంకొంత కాలం ఆగితే క్లారిటీ రావొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి