iDreamPost

Love Me Movie: వైష్ణవి చైతన్య లవ్ మీ టీజర్ రివ్యూ.. దెయ్యంతో రొమాన్స్!

  • Published Mar 07, 2024 | 5:09 PMUpdated Mar 07, 2024 | 5:09 PM

యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా ప్రస్తుతం నటిస్తున్న చిత్రం "లవ్ మీ". తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా ప్రస్తుతం నటిస్తున్న చిత్రం "లవ్ మీ". తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 07, 2024 | 5:09 PMUpdated Mar 07, 2024 | 5:09 PM
Love Me Movie: వైష్ణవి చైతన్య లవ్ మీ టీజర్ రివ్యూ.. దెయ్యంతో రొమాన్స్!

చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేస్తూ.. ఒక్కసారిగా వెండితెరపై బేబీ సినిమాతో .. తెలుగు ప్రజలకు పరిచయం అయినా హీరోయిన్ వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో ఈ అమ్మడి అడ్రస్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పి తీరాలి. ఆ సినిమాలో ఈమె నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఇక ఆ సినిమా తర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. ఈ క్రమంలో తాజాగా ఆశిష్ రెడ్డి , వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో రాబోతున్న సినిమా “లవ్ మీ”. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా .. తాజాగా “లవ్ మీ” సినిమా టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ ఎలా ఉందో చూసేద్దాం.

ఈ మధ్య కాలంలో దాదాపు అందరు హర్రర్ స్టోరీస్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక ఈ సినిమా టీజర్ ను గమనిస్తే.. ఇది హర్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే లవ్ స్టోరీల అనిపిస్తోంది. మనం ఇప్పటివరకు ఎన్నో లవ్ స్టోరీస్ ని చూసి ఉంటాం కానీ, ఈ సినిమాలో లవ్ స్టోరీ మాత్రం మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ మూవీ టీజర్ ను బట్టి చూస్తే. హీరో ఓ దెయ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. భయమేసే చోట రొమాన్స్ ఇంకా ఎక్సయిటింగ్ గా ఉంటుందంటూ .. ఓ భవనంలోకి ఎంటర్ అవుతాడు. ఆ దెయ్యం కంట పడితే చంపేస్తుందని హీరోయిన్ చెప్పినా కూడా .. వినడు. ఆ దెయ్యాన్ని చూడాలని అనుకుంటాడు. ఎలా అయినా దెయ్యాన్ని ప్రేమలో పడేయాలని అనుకుంటాడు. మరి, ఇంతకీ ఆ దెయ్యం ఎవరు ? హీరో దెయ్యాన్ని ప్రేమలో పడేస్తాడా లేదా ! అసలు హర్రర్ లవ్ స్టోరీ వెనుక దాగి ఉన్న కథ ఏంటి ! ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే .. ఈ మూవీ గురించి వచ్చే మరిన్ని అప్ డేట్స్ గురించి వేచి చూడాల్సిందే.

ఇక “లవ్ మీ” సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా త్వరలో పూర్తి చేసుకోనున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. కాగా, ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై .. హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. “లవ్ మీ” సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోనుందో .. మూవీ రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సి ఉంది. మరి “లవ్ మీ” టీజర్ అప్ డేట్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి