iDreamPost

దారుణం.. గంగా నదిలో మునిగితే క్యాన్సర్‌ తగ్గుతుందని

  • Published Jan 25, 2024 | 12:13 PMUpdated Jan 25, 2024 | 12:20 PM

చాలామందికి పవిత్ర పుణ్య నదుల్లో స్నానం చేస్తే సకాల దోషాలు, పాపాలు తొలిగిపోవడంతో పాటు రోగాలు కూడా నయమవుతాయని నమ్మకం ఎక్కువ. ఈ మూఢ నమ్మకమే ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అసలు ఏం జరిగిదంటే..

చాలామందికి పవిత్ర పుణ్య నదుల్లో స్నానం చేస్తే సకాల దోషాలు, పాపాలు తొలిగిపోవడంతో పాటు రోగాలు కూడా నయమవుతాయని నమ్మకం ఎక్కువ. ఈ మూఢ నమ్మకమే ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అసలు ఏం జరిగిదంటే..

  • Published Jan 25, 2024 | 12:13 PMUpdated Jan 25, 2024 | 12:20 PM
దారుణం.. గంగా నదిలో మునిగితే క్యాన్సర్‌ తగ్గుతుందని

దేశంలో రోజురోజుకి టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుంది. కాలంతో పాటు ప్రజల జీవనశైలి కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. అయినా కొన్ని చోట్ల మాత్రం వింత ఆచారాలు మూఢ నమ్మకాలు అనేవి అలాగే కొనసాగుతున్నాయి. వాటి కారణంగా ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. దైవ భక్తి ముసుగులో హత్యచారాలు, ఆత్మాహత్యలు అనేవి తరుచు జరుగుతునే ఉన్నాయి. ఈ విషయాలపై ప్రజలకు ఎంతో అవగాహన కల్పించిన ప్రయోజనం లేకుండా పోతుంది. చదువుకున్న వాళ్లు సైతం ఇలాంటి మూఢ నమ్మకాల బ్రాంతిలో మునిగిపోతున్నారు. ఇదిలా ఉంటే.. చాలామంది హిందువులకు పవిత్ర పుణ్య నదుల్లో స్నానం చేస్తే సకాల దోషాలు, పాపాలు తొలిగిపోతాయని నమ్మకం ఎక్కువ. ఈ క్రమంలోనే ఎంతో మంది పాపాలు తొలిగి పుణ్యం లభించలని పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. ఇలా చేయడం వలన పుణ్యంతో పాటు సకాల రోగాలు నయమవుతాయనే మూఢ నమ్మకం కూడా ఈ కాలంలో కూడా ప్రజల్లో ఎక్కువగా ఉంది. ఇలాంటి మూఢ నమ్మకంతోనే ఓ మహిళ ఒక నిండు ప్రాణాన్ని తీసేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

పవిత్ర పుణ్యక్షేత్రల అయిన నదుల్లో స్నానం చేస్తే రోగాలు నయమైపోతాయని ఇప్పటికి చాలామంది నమ్ముతారు. అచ్చం  ఇలాగే గంగానదిలో మునిగితే క్యాన్సర్ తగ్గిపోతుందంటూ.. ఓ మహిళ తన మేనల్లుడి చావుకు కారణమైంది. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగింది. అసలు ఏం జరిగిదంటే.. సుధా అనే మహిళ తన మేనళ్లుడు రవితో కలిసి బుధవారం అనగా (జనవరి 24) న మధ్యాహ్నం హరిద్వార్ వెళ్లింది. కాగా, రవి గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అయితే గంగానదిలో మునిగితే క్యాన్సర్ తగ్గిపోతుందంటూ హర్ కీ పౌరీ ఘాట్ వద్దకు రవిని తీసుకెళ్లింది.

గంగానది అన్ని రోగాలను తగ్గిస్తుందని, ఐదు నిమిషాలు బయటకు రాకుండా ఉంటే బ్లడ్ క్యాన్సర్ తగ్గిపోతుందని చెప్పింది. అలాగే రవిని ఐదు నిమిషాల పాటు నదిలో స్నానం చేయించింది. ఆ సమయంలో సుధతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఇక ఆమె చేస్తున్న పనిని గమనించిన కొందరు వ్యక్తులు జోక్యం చేసుకుని బాలుడిని బయటకు తీసుకురావాలని కోరడంతో.. ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు రవిని నదిలో నుంచి బలవంతంగా బయటకు తీయగా, ఆమె వారిని అడ్డుకుని ఒకరిని కొట్టడానికి ప్రయత్నించింది. కాగా, నదిలోంచి బయటకు తీసుకొవచ్చిన ఆ బాలుడు అప్పటికే చనిపోయాడు. ఆ సమయంలో మహిళ నవ్వుతూ కనిపించింది. పైగా అక్కడున్న వారితో గొడవకు దిగింది.

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ సమయంలో సుధ నవ్వుతూ కనిపించింది. పైగా అందరు వీడియోలు రికార్డింగ్ చేస్తూ ఉండాలని, రవి మేల్కొంటాడని, ఇది తన వాగ్దానం అంటూ ఆమె వీడియోలో చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సుధతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవి అనాథ అయ్యాడా? లేదా అతని తల్లిదండ్రులు సుధతో పంపించారో వివరాలు తెలియరాలేదు. మరి, మూఢ నమ్మకంతో ఆ బాలుడు ప్రాణాలు తీసిన ఆ మహిళ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి