iDreamPost

దేవుడిలా వచ్చిన రైతు.. తృటిలో తప్పిన పెను రైలు ప్రమాదం!

దేవుడిలా వచ్చిన రైతు.. తృటిలో తప్పిన పెను రైలు ప్రమాదం!

ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. తరచుగా ఎక్కడో ఓ చోట రైలు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. నెల రోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌లో రెండు గూడ్సు రైళ్లు ఢీకొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో వందల మంది చనిపోగా.. వేల మందికి గాయాలయ్యాయి. అయితే, ఆ తర్వాత కూడా కొన్ని ప్రమాదాలు జరిగాయి. వాటిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. తాజాగా, ఓ పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ఓ రైతు సమయ స్పూర్తి కారణంగా ఆ ప్రమాదానికి బ్రేక్‌ పడింది. లేదంటే భారీ ప్రాణ నష్టం సంభవించేది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌, ప్రయోగరాజ్‌ జిల్లా భోలకపుర గ్రామానికి చెందిన ఓ రైతు శుక్రవారం ఉదయం అలా ఊరి బయటకు వచ్చాడు.

సరదాగా నడుస్తూ రైలు పట్టాల దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతడు ఓ షాకింగ్‌ విషయాన్ని గుర్తించాడు. రైలు పట్టా ఓ చోట రెండుగా చీలి ఉంది. దీంతో అతడు భయాందోళనకు గురయ్యాడు. ఏం చేయాలో ఆలోచించసాగాడు. కొద్ది సేపటి తర్వాత అదే పట్టాలపై గోమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు వస్తూ ఉంది. దీంతో అతడిలో భయం మరింత పెరిగింది. మరింత వేగంగా ఆలోచించాడు. అప్పుడు అతడికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ఓ ఎర్ర గుడ్డను తీసుకున్నాడు. దాన్ని గాల్లో ఊపుతూ రైలుకు అడ్డంగా నిలబడ్డాడు. రైలును ఆపాలంటూ గట్టిగా అరవసాగాడు.

రైలు పట్టాలపై ఎర్ర గుడ్డతో ఉన్న రైతను చూడగానే లోకో పైలట్‌ రైలును ఆపాడు. కిందుకు దిగి వచ్చి అసలు విషయం తెలుసుకున్నాడు. రైతు చేసిన పనితో వందల మంది ప్రాణాలు కాపాడబడ్డాయని తెలిసి సంతోషించాడు. తర్వాత ఆ రైతును అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. కొన్ని గంటల పాటు ఆ పట్టాలపై రాకపోకలు నిలిచిపోయాయి. పట్టాను బాగు చేసిన తర్వాత మళ్లీ రాకపోకలు కొనసాగాయి. మరి, రైతు సమయస్పూర్తి కారణంగా పెను ప్రమాదం తప్పటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి