iDreamPost

వాట్సాప్ న్యూ అప్ డేట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యూజర్స్!

వాట్సాప్ న్యూ అప్ డేట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యూజర్స్!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత జనాదరణ పొందిన మెసీజింగ్ యాప్స్ లో వాట్సాప్ ఒకటి. మెటా సంస్థకు చెందిన ఈ మెసేజింగ్ యాప్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో యూజర్లు ఉన్నారు. పర్సనల్ మెసేజింగ్ కోసమే కాకుండా.. ఆఫీస్ వర్క్, గ్రూప్ వీడియోకాల్, కాన్ఫరెన్స్ లకు కూడా వాట్సాప్ ని వాడుతున్నారు. వినియోగదారుల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్లు తెస్తూనే ఉంటుంది. ఆ అప్ డేట్స్ అన్నీ యూజర్ ఫ్రెండ్లీగా.. వారికి ఉపయోగపడేలా ఉంటాయి. అయితే ఇప్పుడు వాట్సాప్ తాజాగా తీసుకొచ్చిన అప్ డేట్ పై మాత్రం వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఎప్పుడూ ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్ల కోసం సెపరేట్ గా అప్ డేట్స్ తెస్తూ ఉంటుంది. ఆండ్రాయిడ్ లో వచ్చే అప్ డేట్స్ ఐవోఎస్ కి.. ఐవోఎస్ లో వచ్చే అప్ డేట్స్ ని ఆండ్రాయిడ్ కి కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం వాట్సాప్ ఒక అప్ డేట్ తీసుకురాబోతోంది. ఇది ప్రస్తుతం బేటీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అదేంటంటే.. ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా వాట్సాప్ యాప్ ని ఐవోఎస్ తరహాలో తీసుకొస్తొంది. ఇకపై కాల్స్, స్టేటస్, కాల్స్ కేటగిరీలు మాత్రమే కాకుండా.. అప్ డేట్స్ అని కూడా కొత్త కాలమ్ వస్తోంది. అలాగే బేటీ యూజర్లకు ఈ అప్ డేట్స్ అనే కాలమ్ సహా అన్నీ కిందవైపు వస్తున్నాయి. కొందరికి మాత్రం సాధారణంగా ఉన్నాయి. కానీ, స్టేటస్ ప్లేస్ లో అప్ డేట్స్ అని వస్తోంది. దానిపై క్రిక్ చేస్తే.. స్టేటస్ కనిపిస్తుంది. కిందకు స్క్రోల్ చేస్తే మీకు ఛానల్స్ అని కనిపిస్తాయి. మీరు వాట్సాప్ షరతులకు అంగీకరించింది. తర్వాత మీకు కొన్ని ఛానల్స్ సజీషన్స్ వస్తాయి. వాటిని క్లిక్ చేయడం వల్ల వారి వాట్సాప్ ఛానల్ కి మీరు ఫాలోవర్ అవుతారు.

ఆ తర్వాత వాళ్లు చేసిన పోస్టులు మీకు అప్ డేట్స్ గా వస్తాయి. మీరు ఫాలో అయ్యే ఛానల్స్ ద్వారా మీకు కావాల్సిన సమాచారాన్ని, అప్ డేట్స్ ని పొందవచ్చు. అయితే ఇప్పుడు ఈ అప్ డేట్ పై యూజర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ సంస్థ తమ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ అనేది ఒక మెసేజింగ్ యాప్. దానిని మెసేజ్ లు, వీడియో, ఆడియో కాల్స్ కోసం వాడుతారు. ఇప్పుడు కొత్తగా స్టేటస్ లు పెట్టేందుకు విరివిగా వాడుతున్నారు. దానిని ఇప్పుడు ఇలా అప్ డేట్స్ పేరిట ఛానల్స్ తీసుకొచ్చింది. దీనిని కూడా తమ ఆదాయం కోసం వాడుతున్నారు అంటూ సీరియస్ అవుతున్నారు. అలాగే వాట్సాప్ లో చాట్ కి చాట్ కి మధ్య యాడ్స్ వస్తాయి అంటూ వార్తలు వచ్చాయి. అయితే అది అవాస్తవం అంటూ వాట్సాప్ కొట్టిపారేసింది. తాజాగా వచ్చిన అప్ డేట్ పై మాత్రం వాట్సాప్ యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి