iDreamPost

బార్లీ నీరు తాగితే ఎన్ని ఉపయోగాలో తెలుసా?

బార్లీ నీరు తాగితే ఎన్ని ఉపయోగాలో తెలుసా?

ఎండాకాలం వస్తే ఏదో ఒకటి తాగుతూ ఉంటాము. మన శరీరాన్ని డీ హైడ్రేడ్ అవ్వకుండా ఉండటానికి రకరకాల పానీయాలు తాగుతాము. కానీ బయట పానీయాలు తాగి అనారోగ్యానికి గురికావడం కంటే మనమే ఆరోగ్యానికి పనికొచ్చే ద్రవ పదార్థాలు తయారు చేసుకొని తాగడం మేలు. ఎండాకాలంలోనే కాక ఎప్పుడైనా ఆరోగ్యానికి పనికొచ్చే పానీయం బార్లీ నీరు. దీన్ని మనమే ఈజీగా తయారు చేసుకోవచ్చు.

మార్కెట్లో దొరికే బార్లీ గింజలు తెచ్చుకొని వాటిని గోధుమ వర్ణం వచ్చే వరకు వేయించి, చల్లార్చి పొడి చేసుకోవాలి. ఓ రెండు చెంచాల బార్లీ పొడిని నీటిలో ఉండలు లేకుండా కలిపి ఒక మిశ్రమంలాగా చేయాలి. ఆ తర్వాత కొన్ని నీటిని పొయ్యి మీద పెట్టి మరిగించాలి. ఆ మరిగిన నీటిలో బార్లీ పొడిని కలిపిని మిశ్రమాన్ని వేసి కలుపుతూ పది నిముషాలు ఉడికించి, తర్వాత చల్లార్చి వడపోయాలి. దీంతో బార్లీ నీరు వస్తుంది. ఈ బార్లీ నీరు డైరెక్ట్ గా తాగొచ్చు లేదా దీనికి మజ్జిగ, ఉప్పు, తేనె లేదా నిమ్మరసం లాంటివి కూడా కలుపుకొని తాగొచ్చు.

బార్లీ నీటిని తాగితే వచ్చే ప్రయోజనాలు..
* బార్లీ నీటిని త్రాగడం వల్ల కాళ్ళ వాపులు తగ్గుతాయి.
* బార్లీ నీటిని త్రాగితే వడదెబ్బ తగలకుండా ఉంటుంది.
* బార్లీ నీటిని త్రాగితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
* బార్లీ నీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయి.
* బార్లీ నీటిని రోజూ త్రాగడం వల్ల శరీరంలోని వేడి బయటకు పోతుంది.
* బార్లీ వల్ల జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది.
* బరువు తగ్గాలనుకునే వారు బార్లీ నీరు త్రాగితే బరువు తగ్గుతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి