iDreamPost

Joe Biden: పన్ను ఎగవేసినట్లు అంగీకరించిన USA అధ్యక్షుడి కొడుకు!

Joe Biden: పన్ను ఎగవేసినట్లు అంగీకరించిన USA అధ్యక్షుడి కొడుకు!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ పై రెండు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పన్ను ఎగవేతతో పాటు అక్రమంగా ఆయుధాలన్ని కలిగి ఉన్నారనే అభియోగాలు ఆయనపై  ఉన్నాయి. ఈ రెండు కేసుల్లో  నేరాన్ని అంగీకరించేందుకు హంటర్ బైడెన్ ముందుకు వచ్చాడు.  ఈ ఇష్యూ పై స్పందిస్తూ నేరాలను ఒప్పుకున్నాడు.  ఇందుకు సంబంధించిన కేసుల్లో న్యాయశాఖ ఒప్పందం కుదుర్చుకునేందుకు హంటర్ బైడెన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. డెలావెర్ లోని యూఎస్ డిస్ట్రిక్ట్  కోర్టులో పిటిషన్  దాఖలు  చేశారు. అయితే ఈ పిటిషన్ పై న్యాయమూర్తి ఇంకా స్పందించలేదు.

త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ హంటర్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమన్హారం. దీంతో జో బైడెన్ కు ఇది గట్టి ఎదురు దెబ్బని రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు.  మరోవైపు ఈ ఇష్యూను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రత్యర్థి పార్టీ బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. 53 ఏళ్ల హంటర్ బైడెన్ గతంలో న్యాయవాదిగానూ, చైనా, యుక్రెయిన్‌లతో పాటు పలు దేశాలలో లాబీయిస్ట్‌గా పని చేశారు. 2014లో ఆయన కొకైన్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో అమెరికా నేవీ నుంచి బయటకు వచ్చాడు. ఇక ఆయన ఆదాయ పన్నుల వ్యవహారంపై గత ఐదేళ్లుగా విచారణ జరుగుతోంది. 2018లో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే హంటర్ కేసులో అధికారులు విచారణ ప్రారంభించారు.

2018లో డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్నారని మరో కేసు నమోదయ్యింది.  ఈ రెండు కేసుల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఒకవేళ ఆ కేసులు ఆరోపణలు నిజమైతే హంటర్ బైడెన్ కు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక.. హంటర్‌ బైడెన్‌ వ్యవహారంపై శ్వేత సౌధం కూడా స్పందించింది. జో బైడెన్‌ దంపతులు తమ కుమారుడిని ఎంతో ప్రేమిస్తారని.. తన జీవితాన్ని పునర్మించుకునే సమయంలో హంటర్‌కు తోడుగా నిలుస్తారని శ్వేత సౌధ అధికార ప్రతినిధి ఇయాన్‌ శామ్స్‌ తెలిపారు.  అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ విషయం హాట్ టాఫిక్ గా మారింది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి