iDreamPost

యువకులకు, రైతులకు 50 లక్షల లోన్.. 50 శాతం సబ్సిడీ!

యువకులకు, రైతులకు 50 లక్షల లోన్.. 50 శాతం సబ్సిడీ!

ఉన్న ఊరిలోనే ఉంటూ వ్యాపారం చేయాలని అనుకునే యువకులకు, ముఖ్యంగా రైతులకు ఇది అద్భుతమైన అవకాశం. 50 శాతం సబ్సిడీపై 50 లక్షల వరకూ రుణం పొందవచ్చు. అంటే మీరు తీసుకున్న లోన్ లో సగం కడితే చాలు. ఉదాహరణకు మీరు 25 లక్షలు లోన్ తీసుకున్నట్లైతే.. 12 లక్షల 50 వేలు కడితే సరిపోతుంది. కొంతమందికి చేసే వ్యాపారాన్ని బట్టి లోన్ మొత్తం మాఫీ అవుతుంది. అంటే నయా పైసా కట్టకుండా ఉచితంగా లోన్ పొందవచ్చునన్నమాట. భారత ప్రభుత్వానికి చెందిన పశు సంవర్థక, పాడి పరిశ్రమ శాఖ.. నేషనల్ డొమెస్టిక్ యానిమల్ ప్రోగ్రామ్ కింద ఈ లోన్ పథకాన్ని అమలు చేస్తుంది. 50 లక్షల రూపాయల వరకూ లోన్ ని అందజేస్తుంది. అంతేకాదు 50 శాతం నుంచి వంద శాతం సబ్సిడీ కూడా ఇస్తుంది.

పాలు, గుడ్లు, మాంసం వంటి వాటి ఉత్పత్తులను పెంచడం కోసం ఈ నేషనల్ డొమెస్టిక్ యానిమల్ ప్రోగ్రాం ని ప్రవేశపెట్టారు. ఉత్పత్తులను పెంచే దిశగా గ్రామీణ ప్రాంతాల్లో కోళ్లు, మేకలు, గొర్రెలు, పందుల ఫార్మ్ లని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. అందుకోసం రైతులకు, ఆసక్తి కలిగిన యువకులకు 50 లక్షల వరకూ రుణాన్ని అందజేస్తున్నారు. ఈ పథకానికి పారిశ్రామిక వేత్తలు, స్వతంత్ర వ్యక్తులు, స్వయం సహాయక సంఘాల వారు, ఫార్మర్ ప్రొడ్యూసర్ సొసైటీకి చెందిన వారు, జాయింట్ లయబిలిటీ గ్రూప్ కి చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ 8 కింద వచ్చే కంపెనీలు కూడా ఈ లోన్ కి అప్లై చేసుకోవచ్చు.

కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులను పెంచేవారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల వరకూ లోన్ పొందవచ్చు. దీని మీద 50 శాతం సబ్సిడీ కూడా పొందవచ్చు. కొంతమంది చేసే వ్యాపారాన్ని బట్టి వంద శాతం సబ్సిడీ కూడా వస్తుంది. అంటే లోన్ ఉచితంగా పొందవచ్చునన్నమాట. ఈ లోన్ పొందాలంటే ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. అందుకోసం ‘నేషనల్ లైవ్ స్టాక్ మిషన్’ పోర్టల్ లోకి వెళ్ళాలి. అక్కడ అప్లై హియర్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ‘login as entrepreneur’ మీద క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీ నమోదు చేసి ఆ తర్వాత ఒక అప్లికేషన్ ఫారం నింపాలి.

అయితే ఈ లోన్ పొందాలంటే కొన్ని డాక్యుమెంట్లు కావాలి. లోన్ తీసుకునే వారికి ఒక ఎకరం పొలం ఖచ్చితంగా ఉండాలి. సొంత భూమి లేకపోతే లీజ్ తీసుకున్నా పర్లేదు. సొంత పొలం లేదా లీజ్ తీసుకున్న పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉండాలి. వీటిని ఆన్ లైన్ లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలానే ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ వంటి గుర్తింపు కార్డులు ఉండాలి. కోళ్ల ఫార్మ్ పెడుతున్న ప్లేస్ కి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేయాలి. పొలం కాగితాలు, నివాస ధ్రువీకరణ పత్రం, రెండు బ్యాంకు చెక్ లు, అవసరం అయితే కనుక కుల ధ్రువీకరణ పత్రం, స్కిల్స్ సర్టిఫికెట్, సంతకం చేసిన స్కాన్డ్ డిజిటల్ డాక్యుమెంట్ కావాలి.

ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాక అధికారిక వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ వెరిఫై అయిన తర్వాత ఎప్పటికప్పుడు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ లోన్ ని పొలం యజమాని మీద గానీ లేదా పొలం లీజ్ తీసుకున్న వ్యక్తి పేరు మీద గానీ ఇస్తారు. లోన్ మంజూరు అయిన 2 వారాల్లో ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. మీరు ఈ లోన్ పొందాలంటే గూగుల్ లో ‘నేషనల్ లైవ్ స్టాక్ మిషన్’ అని సెర్చ్ చేయండి. లేదా nlm.udyamimitra.in/ (ఎన్ఎల్ఎం.ఉద్యమిమిత్రా.ఇన్) వెబ్ సైట్ లోకి వెళ్ళండి. మరి రైతులకు, యువకులకు 50 శాతం సబ్సిడీపై లోన్ ఇస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి