iDreamPost

సినిమాలు కళకళా – బుకింగ్స్ వెలవెలా

సినిమాలు కళకళా – బుకింగ్స్ వెలవెలా

మాములుగా కొత్త సినిమాలు రిలీజవుతున్నాయంటే బాక్సాఫీస్ దగ్గర ఆ ఉత్సాహమే వేరు. ఒకటో రెండో అంటే ఏమో అనుకోవచ్చు స్ట్రెయిట్ డబ్బింగ్ కలిపి ఏకంగా పది వస్తున్నాయంటే ఏ రేంజ్ లో సందడి ఉండాలి. కానీ అదేమీ కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ నీరసంగా ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ సుప్రసిద్ధ ఏఎంబి మాల్లో మాములుగానే హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా పబ్లిక్ మూవీస్ బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటిది రేపు ఇన్ని c ఉన్నా మొత్తం కలిపి ఇప్పటిదాకా రెండు వందల టికెట్లు కూడా అమ్ముడు పోకపోవడం పెద్ద విచిత్రం. కాంతారకు 65, లైక్ షేర్ సబ్ స్క్రైబ్ ఊర్వశివో రాక్షసివోకు చెరో 50 ముందస్తుగా కొన్నారు.

కత్రినా కైఫ్ బొమ్మ ఫోన్ బూత్ కు 16 టికెట్లు తెగాయి. ఇక బనారస్ లాంటి చిన్న చిత్రాలకు ఈ నెంబర్ సింగల్ డిజిట్ లోనే ఉంది. ఇక్కడే ఇలా ఉంటే మిగిలిన మల్టీ ప్లెక్సుల్లో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏ ఒక్కటి ఆసక్తి కలిగించేది లేకపోవడంతో ఆడియన్స్ టాక్ కోసం ఎదురు చూస్తున్నారు. అల్లు శిరీష్ నోటెడ్ హీరో అయినప్పటికీ చాలా గ్యాప్ రావడంతో బన్నీ తమ్ముడనే సింపతీ కూడా ఫాన్స్ నుంచి కనిపించడం లేదు. ఇక సంతోష్ శోభన్ ఎన్ని వెరైటీ ప్రమోషన్లు చేస్తున్నా ఓటిటిలో ఎక్కువ గుర్తింపు ఉన్న ఇతగాడి కోసం టికెట్లు కొనేందుకు ప్రేక్షకులు సుముఖత చూపించడం లేదు. మొత్తంగా చూస్తే లిస్టేమో ఘనంగా ఉంది రెస్పాన్స్ నీరసంగా ఉంది.

ఒకరకంగా చెప్పాలంటే ఇదంతా కరోనా తర్వాత ఓటిటి తాలూకు ప్రభావమే. కష్టపడి థియేటర్ దాకా ఎందుకెళ్లాలనే భావన అంతకంతా పెరుగుతోంది. అదిరిపోయిందనే టాక్ వస్తే తప్ప కదల్లేని మనస్తత్వం అందరికీ అలవడిపోయింది. కాంతార, కార్తికేయ 2, బింబిసార, సీతారామం లాంటి అప్పీలింగ్ కంటెంట్ ఉన్నవాటిని చూసిన కళ్ళతో మా చిన్న సినిమాను రెగ్యులర్ రేట్లకే టికెట్ కొనమని అడిగితే స్పందన ఎలా ఉంటుంది. దీనికి బదులు ఏదైనా స్కీం లాంటిది పెట్టి సగం దాకా రాయితీ ఇవ్వడమో లేదా వన్ ప్లస్ వన్ లాంటివి ఆఫర్లు పెట్టడమో చేస్తే తప్ప ఆకర్షించడం కష్టం. మరి ఇంత పోటీ మధ్య రేపు నెగ్గుకురాబోయే సినిమాలు ఏవో లెట్ వెయిట్ అండ్ సీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి