iDreamPost

యుపి తరహా జోనల్ వ్యవస్థ !! రాజధానితో ప్రజలకు పని లేదిక ..

యుపి తరహా జోనల్ వ్యవస్థ !! రాజధానితో ప్రజలకు పని లేదిక ..

రాజధాని ఆ ఊళ్ళో పెడితే ఈ ఊరోళ్లకి దూరం ..ఇక్కడ పెడితే అక్కడి వాళ్లకు దూరం..అందరికీ అనువైన ప్రాంతం దొరకడం కష్టం. అందుకే అసలు రాజధానికి ప్రజాలు రావాల్సిన అవసరం లేని కొత్త పాలనా వ్యవస్థను తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. అంటే మొత్తం రాష్ట్రాన్ని కొన్ని జోన్లు గా విభజించి అన్నీ పాలనాపరమైన నిర్ణయాలు అక్కడే తీసుకునేలా ఏర్పాట్లు చేస్తారు.

Read Also: మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు.. అసెంబ్లీ లో బిల్లు

అంటే మొత్తం 13 జిల్లాలను నాలుగు జోన్లుగా విభజిస్తారట. అందులో ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు ఒక జోన్, రాయలసీమ నాలుగు జిల్లాలు ఒక జోన్ గా ఏర్పాటు చేస్తారు. మిగిలిన మధ్య కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలను మరో రెండు జోన్లు గావిభజించి అక్కడికక్కడే పరి పాలనా కేంద్రాలు ప్రారంభిస్తారు. ఈ విధానం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉంది. అక్కఫున్న 75 జిల్లాలను 18 జోన్లుగా విభజించి అక్కడ పరిపాలన సాగిస్తున్నారు.

అదే విధానం మన ఏపీలో అమలు చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. ఒక్కో జోన్ కు ఒక్కో నాయకుడిని చైర్మన్ గా నియమించి వారిద్వారా ఆయా జోన్ల పరిపాలన సాగిస్తారు ..దీనివల్ల ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదు ..అందరిని సమభావనతో చూసినట్లు ఉంటుందని అంటున్నారు…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి