iDreamPost

లక్ష్మీపార్వతి కూడా ఫ్యామిలీ మెంబరే.. పిలవకపోవడం తప్పు: ఉండవల్లి

లక్ష్మీపార్వతి కూడా ఫ్యామిలీ మెంబరే.. పిలవకపోవడం తప్పు: ఉండవల్లి

సీనియర్ ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని స్మారక నాణెం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ స్మారక నాణాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే కార్యక్రమానికి సంబంధించి మొదటి నుంచి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతీ అభ్యంతరం వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. ఆవిడను కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై బాహాటంగానే తన అసంతృప్తిని వెల్లిబుచ్చారు. అలాగే రాష్ట్రపతికి లేఖ కూడా రాశారు. అయినా ఆమెకు ఆహ్వానం మాత్రం అందలేదు. తనను కార్యక్రమానికి పిలవకపోవడం ఎన్టీఆర్ కు జరిగిన అవమానంగా లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు.

అయితే లక్ష్మీ పార్వతిని ఆహ్వానించకపోవడంపై పలువురు ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారిలో ప్రముఖంగా ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్మారక నాణెం విడుదల, లక్ష్మీ పార్వతిని ఆహ్వానించకపోవడంపై ఉండవల్లి అరుణ్ కుమార్ ను ప్రశ్నించగా.. “ఆవిడ కూడా ఫ్యామిలీ మెంబరేగా.. కార్యక్రమానికి వెళ్లారా? లక్ష్మీ పార్వతిని పిలవలేదా? మంచిది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రామారావు గారు ఆఖరి రోజుల్లో ఈవిడ వల్లే నేను బతికాను లేదంటే చనిపోయేవాడిని అంటూ చెప్పారు. వీళ్లకు స్టెప్ మదర్ అంటే నచ్చకపోవచ్చు. కానీ, ఆయన రిజిస్టర్ మ్యారేజ్ కాదు.. తిరుపతిలో వేదికపై పెళ్లిచేసుకున్నారు. అది కొంచం నాకు బాధగా ఉంది. ఆవిడను కూడా పిలిచి ఉండాల్సింది” అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఈ స్మారక నాణెం విషయానికి వస్తే.. వీటిని మొత్తం 20 వేల నాణేలు ముద్రిస్తున్నారు. ఇప్పటికే 12 వేలు ముద్రణ జరిగిందన్నారు. ఈ స్మారక నాణెంను 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ తో తయారు చేస్తారు. వీటిని ఆన్ లైన్ లో కొనుగోలు చేయచ్చు. అలాగే హైదరాబాద్ మింట్ కార్యాలయంలో ఈ నాణేన్ని కొనచ్చు. ఈ నాణెం గరిష్ట ధర రూ.4,850 వరకు ఉంటుందని చెప్పారు. ఇప్పటి నుచిం ఒక వ్యక్తి కోసం కేవలం ఒక నాణెం మాత్రం విక్రయిస్తామన్నారు. ఈ స్మారక నాణెం కోసం సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు క్యూ కడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి