iDreamPost

పద్ధతి లేకుండా రాజకీయాలు చేస్తున్న జగన్

పద్ధతి లేకుండా రాజకీయాలు చేస్తున్న జగన్

Unconventional politics of Jagan

Man is a creature of habit అంటారు మానసిక విశ్లేషకులు. మనిషి ఒక పద్ధతికి అలవాటు పడిపోయి అలాగే జీవితం గడుపుతూ ఉంటాడు. ఏ కారణం చేతనైనా అది కొంచెం మారితే కంగారుపడిపోయి ఆ పద్ధతి తిరిగి నెలకొనేవరకూ అశాంతికి గురవుతాడు అంటారు విశ్లేషకులు.

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో నాయకులు తరతరాలుగా పార్టీలకతీతంగా అలవాటు పడిపోయిన పద్ధతులను ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఛిన్నాభిన్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన

ఇంతవరకూ ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకులు వెంటనే అక్కడికి చేరుకుని హడావుడి చేయడం, బాధితులతో కలిసి ఫోటోలు దిగి, పరామర్శించడం, ఎంతోకొంత నష్టపరిహారం డిమాండ్ చేయడం, దాన్ని కొద్దిగా తగ్గించి ప్రభుత్వం ప్రకటించడం, దానికోసం బాధితులు ఆఫీసుల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగి, ఎంతోకొంత నైవేద్యం సమర్పించుకుంటే ఆ పరిహారం చేతితో పడటం అనేది ప్రజలతో సహా అందరూ అలవాటు పడి, ఆమోదించిన ప్రక్రియ.

అయితే విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో ప్రతిపక్షాల కన్నా ముందే ముఖ్యమంత్రి బాధితులను పరామర్శించి, ప్రతిపక్ష నాయకుడు డిమాండ్ చేసినదానికి నాలుగింతలు పరిహారం ప్రకటించడం, పక్కరోజే ఆ మొత్తాన్ని శాంక్షన్ చేస్తూ జీవో విడుదల చేయడం, రెండు రోజుల్లో చెక్కులు బాధితుల దగ్గరకు నడుచుకుంటూ రావడం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి డిశ్చార్జి టైములో పరిహారం చెక్కు కూడా అందజేయడం అనేది కొత్తగా ఉండడమే కాకుండా ప్రతిపక్షానికి ఎలా స్పందించాలో తెలియకుండా చేసింది. అప్పటికి అచ్చన్నాయుడు కోటి రూపాయలు చాలదు పది కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసి, మరుసటి రోజు పత్రికల్లో చదివాక ఆ డిమాండ్ ఎంత పెద్ద జోకో అర్ధమై సైలెంటుగా ఉండిపోయాడు.

పవన్ కళ్యాణ్ ట్వీట్

వలస కార్మికుల కష్టాల మీద స్పందించనందుకు కేంద్రాన్ని, ప్రజల ముందుకు వచ్చి లాక్ డౌన్ అనౌన్స్ చేసిన నాలుగు సార్లు కాలి నడకన వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్న వారి గురించి ఒక్క మాట కూడా చెప్పినందుకు ప్రధాన మంత్రిని విమర్శిస్తున్న వారికి సమాధానంగా వలస కార్మికుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని తన పార్టీ పొత్తు పెట్టుకున్న బీజేపీని కాపాడడానికి ఒక ట్వీట్ పెట్టాడు పవన్ కళ్యాణ్.

అయితే అంతకు రెండు రోజుల ముందే రాష్ట్రం గుండా నడిచి వెళ్ళే వలస కార్మికులక ఆహారం, తాత్కాలిక వసతి, అందరికి కొత్త చెప్పులు ఇచ్చి రాష్ట్ర సరిహద్దు వరకూ తరలించడానికి బస్సు సదుపాయం కల్పించాలని జగన్ ఆదేశాలు జారీచేశారు. జగన్ గురించి పాజిటివ్ న్యూస్ ఒక్కటీ రాయడానికి ఇష్టపడని పత్రికల్లో కూడా ఈ వార్త వచ్చింది.

ప్రతిపక్షం స్పందించకముందే అధికార పక్షం స్పందించడం వల్ల కలిగే ఇబ్బందులు ఇవి.

ఉద్యోగాలు, ఇళ్ల స్థలాలు

జగన్ ప్రభుత్వం రాగానే కొత్తగా పెట్టినది గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ. వాలంటీర్ అన్నది పెద్దగా జీతం ఇచ్చే ఉద్యోగం కాకపోయినా, ఉన్న ఊరిలో ఉద్యోగం కాబట్టి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష పెట్టి, వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరి సిఫారసులు ఇందులో పని చేయలేదు. ఎమ్మెల్యే అయిఉండీ వాలంటీర్ ఉద్యోగం ఇప్పించలేకపోతున్నామని చాలా మంది వాపోయారు అప్పట్లో.

గత ప్రభుత్వ హయాంలో సింహ భాగం పనులు అధికార పక్షం వారికి దక్కేలా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు. కొన్ని సార్లు బహిరంగ సభల్లో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి గారే అడిగారు నాకు ఓట్లేయని వారికి పనులెందుకు చేయాలి అని.

ఇప్పుడు పేదవారికి ఇళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమంలో కూడా పార్టీలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయమని ఆదేశాలు ఇచ్చి ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశం లేకుండా చేశారు.

ఇప్పుడు అధికార పక్షం మీద పోరాటం చేయడానికి సరయిన అంశమేమీ లేక సాక్షాత్తు ప్రతిపక్షం జాతీయ అధ్యక్షుడు ట్విట్టర్ లో బహిరంగంగా మందు కొట్టి నానా రచ్చ చేసిన వ్యక్తి కోసం పోరాటం చేయడానికి పరిమితం అయిపోయాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి