iDreamPost

ఉచిత ఆధార్ అప్‌డేట్‌పై UIDAI కీలక ప్రకటన!

ఆధార్ కార్డు జారీ అయ్యి పదేళ్లు దాటితే అప్ డేట్ చేసుకోవాలని కేంద్రం నిబంధనలు పెట్టిన సంగతి తెలిసింది. అయితే ఈ కార్డును ఉచితంగా అప్ డేట్ చేసుకునే విషయంలో యూఐడీఏఐ కీలక విషయాన్ని వెల్లడించింది.

ఆధార్ కార్డు జారీ అయ్యి పదేళ్లు దాటితే అప్ డేట్ చేసుకోవాలని కేంద్రం నిబంధనలు పెట్టిన సంగతి తెలిసింది. అయితే ఈ కార్డును ఉచితంగా అప్ డేట్ చేసుకునే విషయంలో యూఐడీఏఐ కీలక విషయాన్ని వెల్లడించింది.

ఉచిత ఆధార్ అప్‌డేట్‌పై UIDAI కీలక ప్రకటన!

ఆధార్ కార్డు.. దీనికి గురించి తెలియని వారు ఉండరు. భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆధార్ కార్డును జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇది విడుదలై కూడా చాలా ఏళ్లు గడుస్తోంది. ఇక నేటికాలంలో ప్రతి పనికీ ఆధార్ కార్డే ఆధారమైపోయింది. అందుకే ఈ కార్డు విషయంలో ఎప్పుడూ అప్‌డేట్‌లో ఉండాలి. ఈ క్రమంలోనే ఇటీవల యూఐడీఏఐ.. ఆధార్ కార్డు విషయంలో కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. ఏవరికైనా కార్డు జారీ చేసి పదేళ్లు పూర్తైతే అప్‌డేట్ చేయాలి. ఈక్రమంలోనే తాజాగా మరో కీలక సూచన చేశారు. ఉచిత ఆధార్  అప్ డేట్ పై యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది. ఆధార్  అప్ డేట్ కు చివరి తేదీని ప్రకటించింది.

గడిచిన కొన్నేళ్లుగా ఆధార్ కార్డు అనేది ఓ అత్యవసర డాక్యుమెంట్ గా మారింది.  ఇది మన దేశ పౌరులకు విశిష్టమైన గుర్తింపు కార్డుగా ఉంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, సేవలు పొందేందుకు ఆధార్ తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో ఎవరైనా ఆధార్ కార్డు పొంది పదేళ్లు దాటితే..ఒక్కసారి కూడా అప్‌డేట్ కాకపోతే.. అప్‌డేట్ చేయించాల్సి ఉందేనని నిబంధనలను కేంద్రం విడుదల చేసింది.

అయితే ఇప్పటి వరకు అప్ డేట్ చేయని వారు 2023 డిసెంబర్ 14లోపు అప్ డేట్ చేసుకోవాలని విశిష్ట ప్రాధికారిక సంస్థ(యూఐడీఏఐ) తెలిపింది. త్వరలో గడువు ముగినుండడంతో ఈ ప్రకటన విడుదల చేసింది. గడువు తర్వాత అప్ డేట్ చేసుకోవాలంటే మాత్రం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు  కోసం పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచి పదేళ్లు పూర్తైన వారు తగిన ధ్రువపత్రాలు సమర్పించి అప్ డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది.

అంతేకాక ఇక నుంచి ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్లకు ఒక్కసారి గుర్తింపు కార్డు, చిరునామా వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ సమర్పించి.. కేంద్ర గుర్తింపు సమాచార నిధి లో  వివరాలను అప్ డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమచారం సీఐడీఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటుందని తెలిపారు. ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి సాయ పడుతుందని తెలిపింది. ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తైన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం యూఐడీఏఐ అధికార వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి  కొత్త గుర్తింపు కార్డు, అడ్రెస్ వివరాలను నమోదు చేయాలి.

రేషన్ కార్డు, ఓటర్ ఐడీ , కిసాన్ ఫోటో పాస్ బుక్, పాస్ పోర్టు వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలను వినియోగించుకోవచ్చు ఉడాయ్ తెలిపింది. మూడు నెలలకు మించని కరెంట్, గ్యాస్, టెలిఫోన్, వాటర్ బిల్లులను  చిరునామా వెరిఫికేషన్ డాక్యుమెంట్ గా ఉపయోగించుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. మొత్తంగా ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకోవడానికి డిసెంబర్ 14 చివరి తేదీ అని యూఐడీఏఐ స్పష్టం చేసింది. మరి.. ఉడాయ్ తెలిపిన వివరాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి