iDreamPost

Ugadi 2024 Panchangam: కర్కాటక రాశి స్త్రీలకు క్రోధీ నామ సంవత్సరంలో ఆ సమస్య.. జాగ్రత్తగా ఉండకపోతే!

Ugadi 2024 Panchangam karkataka Rasi Phalalu in Telugu: క్రోధీనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వారి ఆదాయం ఎంత? రాజపూజ్యం, అవమానాలు ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం.

Ugadi 2024 Panchangam karkataka Rasi Phalalu in Telugu: క్రోధీనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వారి ఆదాయం ఎంత? రాజపూజ్యం, అవమానాలు ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం.

Ugadi 2024 Panchangam: కర్కాటక రాశి స్త్రీలకు క్రోధీ నామ సంవత్సరంలో ఆ సమస్య.. జాగ్రత్తగా ఉండకపోతే!

ఉగాది.. తెలుగు సంవత్సరాది పండుగ. ఇక ఈ ఉగాదితో క్రోధీనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ పండగ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది పంచాంగ శ్రవణం. జోతిష్య పండితులు చెప్పే ఉగాది పంచాంగం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఏడాది తమకు ఎలా ఉండబోతుంది? తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. మరి ఈ క్రోధీనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వారి ఆదాయం ఎంత? రాజపూజ్యం, అవమానాలు ఎంత? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి వారికి బృహస్పతి లాభ స్థానంలో, శని అష్టమ, రాహువు భాగ్య, కేతువు తృతీయ స్థానంలో సంచరించడం వల్ల ఈ ఏడాది కర్కాటక రాశి వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అయితే రాహువు అనుకూలత వలన మధ్యస్థం నుంచి మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు తమ వృత్తిలో అనుకూల ఫలితాలు కలుగుతాయి. ప్రమోషన్లలో ఇబ్బందులు పడే వారికి ఆ సమస్యలు తొలగి శుభ ఫలితాలను పొందుతారు. ఇక బిజినెస్ చేసేవారు ఒత్తిడికి దూరంగా ఉండాలి. తద్వారా ఈ ఏడాది వారికి నష్టాలు తప్పుతాయి. అష్టమ శని కారణంగా కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వాటి పట్ల జాగ్రత్త వహించాలి.

కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ప్రధానంగా కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదు. వాటిటి దూరంగా ఉండాలి. పైగా ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. స్త్రీలను కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు మధ్యమ ఫలితాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొన్ని ఆటంకాలు ఎదురౌతాయి. కర్కాటక రాశి రైతులకు ఈ ఏడాది అంత అనుకూలంగా లేదని జోతిష్యులు తెలుపుతున్నారు. సినిమా, మీడియా రంగాల వారికి కూడా క్రోధీనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలే ఉన్నాయని పండితులు చెప్పుకొస్తున్నారు. జీవిత భాగస్వామితో ఆచితూచి వ్యవహరించాలి, లేకపోతే చిక్కులు తప్పవు. ఇక ఈ ఏడాది ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. డబ్బు విషయంలో పురోగతి కనబడుతుంది.

కర్కాటక రాశి వారి ఆదాయం, వ్యయాల విషయానికి వస్తే..

  • ఆదాయం – 14
  • వ్యయం -2
  • రాజపూజ్యం – 6
  • అవమానం – 6
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇచ్చింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి