iDreamPost

Ugadi 2024 Panchangam: కన్యారాశి వారికి క్రోధీ నామ సంవత్సరం అంత బాగానే ఉంది.. కానీ..!

Ugadi 2024 Panchangam Kanya Rasi Phalalu in Telugu: క్రోధీనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది? వారి ఆదాయం ఎంత? రాజపూజ్యం, అవమానాలు ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం.

Ugadi 2024 Panchangam Kanya Rasi Phalalu in Telugu: క్రోధీనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది? వారి ఆదాయం ఎంత? రాజపూజ్యం, అవమానాలు ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం.

Ugadi 2024 Panchangam: కన్యారాశి వారికి క్రోధీ నామ సంవత్సరం అంత బాగానే ఉంది.. కానీ..!

హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో  ఉగాది ఒకటి. అంతేకాక ఈ పండగతోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9, మంగళవారం నుంచి క్రోధీ నామ అనే కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఇక ఉగాది పర్వదినం రోజున ఇళ్లువాకిళ్లు శుభ్రంద చేసుకుని కొత్త బట్టలు ధరించి దేవుళ్లకు పూజలు చేస్తారు. ఇక ఉగాది అనగానే గుర్తుకు వచ్చేది పంచాగ శ్రావణం, అలానే రాశి ఫలాలు. ఏటా ఉగాది పండుగ నాడు పండితులు, జ్యోతిశాస్త్ర నిపుణులు ఆయా కొత్త ఏడాదిలో రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి.. ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి.. దేశవ్యాప్తంగా పరిస్థితులు, వాతావరణం ఎలా ఉండబోతున్నాయో చెబుతుంటారు.

ఈ తెలుగు కొత్త సంతవత్సరం ఉగాది రోజునా ప్రతి ఒక్కరు పంచాగ శ్రవణం చేస్తారు.  సామాన్యుల నుంచి సెలబ్రీటల వరకు అందరూ తమ ఇళ్లల్లో, ఆఫీసుల్లో పంచాగ శ్రవణం ఏర్పాటు చేయించుకుంటారు. ఇది ఇలా ఉంటే.. క్రోదీ నామ సంవత్సరంలో రాశుల వారీగా చూసుకుంటే..  కన్యారాశి ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది మేష రాశి వారికి ఉద్యోగ, ఆరోగ్య, వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి.. వీటి గురించి జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చెప్పారంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కన్యారాశికి వారికి గురు, శని గ్రహాల వల్ల సగం పైన శ్రేష్టమైన ఫలితాలున్నాయి. మే నుండి బృహస్పతి అనూకలం వల్ల విశేష ధనలాభం, గృహలాభం తదితర ఫళితాలుంటాయి. మే వరకూ సామాన్యంగా ఉన్నా, ఆ తరువాత మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం గురించి శుభవార్త వింటారు. మనశ్సాంతినీ సంకల్పసద్దినీ పొందుతారు. మరిన్ని శుభఫళితాలకై రాహు కేతువులను ధ్యానించాలి. కన్యారాశి ఉద్యోగులకు మంచి ఫలితాలు కనిపిస్తాయని అంటున్నారు. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలానే వ్యాపార ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని.. అంటున్నారు.

అలానే కన్యారాశికి వారు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్తర మిగిలిన మూడు పాదాలు, హస్తాలోని నాలుగు పాదాలు, చిత్తా నక్షత్రంలోని రెండు పాదాలు కన్యారాశి.  కన్యా రాశి వారు మాత్రం ఈ ఏడాది సగంత వరకు  చాలా కఠినమైన నిర్ణయాలను, సవాళ్లని ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని వివాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే కొన్ని వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే ఈ రాశి వారికి చాలా మంచిది. ఈ రాశి వారందరికీ కూడా కొన్ని ప్రలోభాలకి లోనై ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా వివాదాలకు పోకుండా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

అలానే ఆర్థిక నష్టం జరగకుండా చూసుకోవాలి. డబ్బుకు సంబంధించిన విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్త అవసరం. అలానే ఆర్థిక పరిస్థితి సమానంగా ఉన్నా.. అనుకోని ఖర్చులు పెరుగుతాయని.. ఫలితంగా వ్యయాలు కూడా అధికంగా ఉంటాయని.. దీని పట్ల కాస్త జాగ్రత్త వహించాలని పండితులు సూచిస్తున్నారు. ఇక ఈ ఏడాది కన్యారాశి విద్యార్థులు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారని.. కానీ ప్రణాళిక ప్రకారం పని చేసుకుంటూ వెళ్తే విజయం సాధిస్తారని చెబుతున్నారు. ఇక ఆరోగ్య పరంగా చూసుకుంటూ ఈ ఏడాది కన్యారాశి వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని.. కాకపోతే వాతావరణ మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

ఇక ఆదాయ, వ్యయాల విషయానికి వస్తే ఈ ఏడాది కన్యారాశి వారికి:

  • ఆదాయం-5
  • వ్యయం-5
  • రాజపూజ్యం-5,
  • అవమానం-2 .
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇచ్చినది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి