iDreamPost

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సింగరేణి.. ఇక నుంచి వారికి రూ. కోటి!

సింగరేణి ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సింగరేణి కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో ఉద్యోగులకు ఇక నుంచి రూ.కోటి అందించనుంది.

సింగరేణి ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సింగరేణి కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో ఉద్యోగులకు ఇక నుంచి రూ.కోటి అందించనుంది.

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సింగరేణి.. ఇక నుంచి వారికి రూ. కోటి!

సిరులు కురిపించే సింగరేణి ఉద్యోగులకు వరాలు కురిపిస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రభుత్వాధీనంలో నడిచే సంస్థ. సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఉద్యోగుల భవిష్యత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది సింగరేణి. అదేవిధంగా సింగరేణిలో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు, సిబ్బందికి అధిక బోనస్ లు ప్రకటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సింగరేణి సంస్థ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి వారికి కోటి రూపాయలు అందనున్నాయి. దీనికి సంబంధించి సింగరేణి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కీలక ఒప్పందం చేసుకుంది.

సింగరేణి ఉద్యోగులకు భారీ శుభవార్త. ఉద్యోగుల ప్రమాద బీమాకు సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సింగరేణి కీలక ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అకౌంట్ కలిగిన సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు అంగీకరించారు. సింగరేణి సీఎండీ బలరాం ఆదేశాల మేరకు సంస్థ ప్రధాన కార్యాలయంలో సంబంధిత అధికారులతో బ్యాంకు అధికారులు చర్చించి ఎంవోయూ కుదుర్చుకున్నారు. కాగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచే సింగరేణి ఉద్యోగులకు కొత్త ఇన్సూరెన్స్ వర్తింపజేయనున్నట్లు యూబీఐ బ్యాంకు అధికారులు వెల్లడించారు.

Singareni employees will get Rs crore

కాగా, ఇప్పటి వరకు ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉంది. సింగరేణి, యూబీఐ మధ్య జరిగిన ఈ కీలక ఒప్పందంతో ఇప్పుడు ప్రమాద బీమా రూ.కోటికి పెరగనుంది. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది. మరి సింగరేణి ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి