iDreamPost

Arshin Kulkarni: అండర్‌ 19 WCలో జూనియర్‌ హార్దిక్ పాండ్యా! చితక్కొట్టాడు..

  • Published Jan 29, 2024 | 8:35 PMUpdated Jan 29, 2024 | 8:35 PM

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా స్ఫూర్తితో ఓ కుర్రాడు చెలరేగి ఆడుతున్నాడు. అండర్-19 వరల్డ్ కప్​లో దుమ్మురేపుతున్న ఆ యంగ్​స్టర్ పేరు అర్షిన్ కులకర్ణి.

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా స్ఫూర్తితో ఓ కుర్రాడు చెలరేగి ఆడుతున్నాడు. అండర్-19 వరల్డ్ కప్​లో దుమ్మురేపుతున్న ఆ యంగ్​స్టర్ పేరు అర్షిన్ కులకర్ణి.

  • Published Jan 29, 2024 | 8:35 PMUpdated Jan 29, 2024 | 8:35 PM
Arshin Kulkarni: అండర్‌ 19 WCలో జూనియర్‌ హార్దిక్ పాండ్యా! చితక్కొట్టాడు..

టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఇప్పుడు ఎంతో కష్టంగా మారింది. ప్రస్తుతం భారత జట్టులో దాదాపుగా అన్ని స్థానాలకు బ్యాకప్​గా చాలా మంది ఉన్నారు. ప్లేయింగ్ ఎలెవన్​లో చోటు కోసం ఆశిస్తున్న వారి సంఖ్య కూడా పెద్దగానే ఉంది. అయితే పేస్ ఆల్​రౌండర్స్​కు మాత్రం టీమిండియాలో భారీ డిమాండ్ ఉంది. అందుకు కారణం స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా తరచూ గాయాలపాలవడమే. బ్యాటింగ్​, బౌలింగ్​తో పాటు ఫీల్డింగ్​లోనూ దుమ్మురేపుతూ కీలకంగా మారిన పాండ్యా ఎప్పుడూ గాయాలతో సావాసం చేస్తుండటంతో అతడికి కరెక్ట్ రీప్లేస్​మెంట్ కోసం శివమ్ దూబె లాంటి వారిని టీమ్ మేనేజ్​మెంట్ పరీక్షిస్తోంది. దూబె తానేంటో ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​తో ప్రూవ్ చేశాడు. అయితే పాండ్యా ప్లేస్ కోసం తాను కూడా పోటీలో ఉన్నానని అంటున్నాడు ఓ యంగ్ ఆల్​రౌండర్. అతడే అర్షిన్ కులకర్ణి.

అండర్-19 వరల్డ్ కప్​లో అర్షిన్ కులకర్ణి అదరగొడుతున్నాడు. బ్యాట్​తో పాటు బాల్​తోనూ రాణిస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నాడు. మెగాటోర్నీలో భాగంగా యూఎస్​ఏతో జరిగిన మ్యాచ్​లో సెంచరీ (118 బంతుల్లో 108 రన్స్)తో ఆకట్టుకున్నాడు అర్షిన్. ఈ ఇన్నింగ్స్​లో అతడి బ్యాట్ నుంచి 8 బౌండరీలతో పాటు 3 భారీ సిక్సులు వచ్చాయి. అతడి శతకం కారణంగా మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 రన్స్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన యూఎస్​ఏ అన్ని ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసి భారీ ఓటమిని మూటగట్టుకుంది. సెంచరీతో అలరించిన అర్షిన్​కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ తర్వాత అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హార్దిక్ పాండ్యానే తనకు స్ఫూర్తి అని తెలిపాడు.

లెగ్​ స్పిన్నర్​గా కెరీర్​ను స్టార్ట్ చేశాడు అర్షిన్. అయితే అవకాశాలు రాకపోవడంతో స్పిన్ బౌలింగ్​ను వదిలేసి పేస్ బౌలింగ్ మీద ఫోకస్ చేశాడు. అలాగే బ్యాటింగ్​ను కూడా మరింతగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. దీని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. అండర్ 19 వరల్డ్ కప్​లో యూఎస్​ఏపై సెంచరీతో మెరిశాడు. దీని గురించి అతడు రియాక్ట్ అయ్యాడు. ‘లెగ్ స్పిన్నర్​గా కెరీర్ మొదలుపెట్టా. కానీ అవకాశాలు రాలేదు. క్రికెట్​లో పేస్ బౌలింగ్ ఆల్​రౌండర్స్ సంఖ్య తక్కువగా ఉందని అర్థం చేసుకున్నా. అందుకే ఆ దిశగా ప్రయత్నించా. నా ఫేవరెట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా. అందుకే అతడు ధరించే జెర్సీ నంబర్ 33నే నేను కూడా వేసుకుంటున్నా’ అని అర్షిన్ కులకర్ణి చెప్పుకొచ్చాడు. కాగా, ఇప్పటిదాకా 6 టీ20లు ఆడిన అర్షిన్ 4 వికెట్లు పడగొట్టాడు. అతడు బ్యాటింగ్, బౌలింగ్​లో మరింత ఇంప్రూవ్ అయి.. ఇదే పెర్ఫార్మెన్స్​ను కంటిన్యూ చేస్తే చేసుకుంటే త్వరలో భారత సీనియర్ టీమ్​లోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. అప్పుడు పాండ్యాను స్ఫూర్తిగా తీసుకున్నోడు అతడికే పోటీ అవుతాడని చెబుతున్నారు. మరి.. జూనియర్ హార్దిక్​గా పిలుస్తున్న అర్షిన్ కులకర్ణి ఫ్యూచర్​లో టీమిండియాకు ఆడగలడని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి