iDreamPost

ప్రభాస్ కల్కి 2898ADలో ఇద్దరు అతిథులు!

  • Published Jan 18, 2024 | 10:56 PMUpdated Jan 19, 2024 | 11:28 AM

ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడి’ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు.

ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడి’ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు.

  • Published Jan 18, 2024 | 10:56 PMUpdated Jan 19, 2024 | 11:28 AM
ప్రభాస్ కల్కి 2898ADలో ఇద్దరు అతిథులు!

తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. హిట్.. ఫ్లాప్ తో సంబంధం లేకుండా కేవలం ప్రభాస్ క్రేజ్ తోనే కలెక్షన్లు వస్తాయన్న నమ్మకం దర్శక, నిర్మాతల్లో ఉందంటున్నారు ఫిలిమ్ వర్గాలు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సాహూ, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఆరేళ్లుగా ప్రభాస్ తో పాటు ఆయన అభిమానులు బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూపులు చూశారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సలార్’ రిలీజ్ అయిన అన్ని ధియేటర్లలో ప్రభంజనం సృష్టించింది.. ఆరేళ్ల ఆకలి తీరిందని అభిమానులు తెగ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి పైనే ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అత్యంత భారీ బడ్జుట్ తో తెరకెక్కబోతున్న ‘కల్కి 2898 ఏడి’ పై ప్రభాస్ ఫ్యాన్స్ కోటి ఆశలు పెట్టుకున్నారు. సలార్ తో మంచి విజయం అందుకున్న ప్రభాస్.. కల్కి 2898 ఏడి ప్రపంచ స్థాయిలో దుమ్మురేపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సంక్రాంతి పండగ పురస్కరించుకొని ఈ మూవీ  మే 9 రిలీజ్ కాబోతున్నట్లు డేట్ ని అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేశారు చిత్ర యూనిట్. ఈ మూవీ రెండు భాగాలు ఉండబోతున్న నేపథ్యంలో మొదట పార్ట్ వన్ కు సంబంధించిన షూట్ పూర్తి చేసేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ గట్టి ప్రయత్నం మీదే ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీలో భారీ తారాగణం నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రెండు ప్రత్యేక అతిధి పాత్రలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి.

కల్కి 2898 ఏడి లో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కన్ సల్మాన్ నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కాకపోతే ఈ విషయం  ఆయన పలు ఇంటర్వ్యూల్లో దాటవేశారు. టీమ్ నుంచి అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాకుండా లీక్ చేయొద్దన్న ఉద్దేశంలో ఉండొచ్చు అని అభిమానులు అనుకుంటున్నారు. ఇక రెండో అతిధి విజయ్ దేవరకొండ అని ఫిలిమ్ వర్గాల్లో వినికిడి. గతంలో నాగ అశ్విన్ దర్శకత్వంలో ఎవడే సుబ్రమణ్యం మూవీలో విజయ్ దేవరకొండ నటించాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహసంబంధం కొనసాగుతుంది. ఈ కారణంతోనే మహానటిలో చిన్న పాత్రలో నటించాడు విజయ్ దేవరకొం. కాకపోతే ఈ విషయం చిత్ర యూనిట్ నుంచి అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి