iDreamPost

వీడియో: గుద్దుకున్న రెండు హెలికాప్టర్లు.. ముగ్గురు మృతి!

వీడియో: గుద్దుకున్న రెండు హెలికాప్టర్లు.. ముగ్గురు మృతి!

ఆకాశంలో ఘోర ప్రమాదం సంభవించింది. రెండు హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు గుద్దుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కార్చిచ్చును అదుపుచేసేందుకు హెలికాప్టర్లతో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగ కమ్మేయడం వల్లే ఎదురు ఏముందో కనిపించక ఈ ప్రమాదం జరిగినటలు అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు కూడ ఆదేశాలు జారీ చేశారు.

ఆదివారం కాలిఫోర్నియాలోని కాబాజోన్ ప్రాంతంలో కార్చిచ్చు వ్యాపించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, అగ్నిమాపక అధికారులు పరస్పరం కలిసి మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. మంటలను అదుపుచేసేందుకు రెండు హెలికాప్టర్లను కూడా రంగంలోకి దింపారు. అటవీ ప్రాంతం కావడంతో మంటలు చాలా త్వరగా వ్యాపించాయి. అంతేకాకుండా దట్టమైన పొగ కూడా ఆకాశాన్ని కమ్మేసింది. అక్కడ మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్న అధికారులు ఏం కనిపించడం లేదు ఈ క్రమంలోనే మంటలు ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న రెండు హెలికాప్టర్లు ద్టమైన పొగ కారణంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం గురించి అటవీ, అగ్నిమాపక సంరక్షణ విభాగం ప్రతినిధి రిచర్డ్ కోర్డోవా వెల్లడించారు. “కార్చిచ్చును అదుపుచేసే క్రమంలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశాం. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ ఎమర్జెన్సీ సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రమాదం సమయంలో హెలికాప్టర్లలో ఉన్న సిబ్బంది వివరాలను సేకరిస్తున్నాము. ఈ విషాద ఘటనలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు అనే దానిపై స్పష్టత లేదు” అంటూ రిచర్డ్ వ్యాఖ్యానించారు. అయితే ముగ్గురు ప్రాణాలు కోల్పోయి ఉంటారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకుని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అడవి, ప్రజలను కాపాడే క్రమంలో వీళ్లు చనిపోవడం బాధగా ఉందన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి