iDreamPost

Vrushika Mehta: ప్రియుడిని పెళ్లాడిన సీరియల్ నటి! వైరలవుతున్న ఫొటోలు..

  • Author Soma Sekhar Published - 09:08 PM, Tue - 12 December 23

తాజాగా ఓ బుల్లితెర నటి పెళ్లితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

తాజాగా ఓ బుల్లితెర నటి పెళ్లితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

  • Author Soma Sekhar Published - 09:08 PM, Tue - 12 December 23
Vrushika Mehta: ప్రియుడిని పెళ్లాడిన సీరియల్ నటి! వైరలవుతున్న ఫొటోలు..

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే ఇది సామన్యులకే కాక.. సెలబ్రిటీలకు కూడా. ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రిటీలు తమ బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలికి వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇక కొంత మంది బ్యూటీలు తమ డేటింగ్ బంధాలకు వీడ్కోలు పలుకుతూ.. పెద్దలను ఒప్పించి తాము ఇష్టపడిన వాడినే మనువాడుతున్నారు. తాజాగా మరో బుల్లితెర నటి పెళ్లితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

వృషికా మెహతా.. బాలీవుడ్ సీరియల్ నటి. యే రిష్త్యా క్యా కెహ్లతా హై, దిల్ దోస్తీ డ్యాన్స్ సీరియల్స్ తో బీ టౌన్ బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ తన లవర్ సౌరభ్ ఘెడియాను పెళ్లాడింది. వీరి వివాహ వేడుక అహ్మదాబాద్ లో డిసెంబర్ 10న అంగరంగ వైభవంగా జరిగింది. కాగా.. గతేడాది డిసెంబర్ 11న ఈ జంట ఎంగేజ్ మెంట్ చేసుకుంది. సరిగ్గా సంవత్సరానికి పెళ్లితో ఒక్కటైయ్యారు. వీరి వివాహనికి బందువులు, స్నేహితులతో పాటు సినీ ప్రముఖులు హాజరై.. కొత్త జంటను దీవించారు. ఇక ఈ సంతోషకరమైన సమయాన్ని అభిమానులతో పంచుకుంటూ.. పెళ్లి ఫొటోలను తన ఇన్ స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. వృషికా మెహతా దిల్ దోస్తీ డ్యాన్స్ షోలో ప్రదర్శనకు ప్రశంసలు అందుకుంది. ఇక ఆమె భర్త సౌరభ్ టోరంటోలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేస్తున్నాడు. కొత్త జంటకు నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vrushika Mehta (@vrushyy)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి