iDreamPost

39 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ! వరుడెవరంటే?

తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ పెళ్లికి రెడీ అయ్యింది. 39 ఏళ్ల లేటు వయసులో ఈ ముద్దుగుమ్మ వివాహానికి సిద్దమైంది. మరి ఆ బ్యూటీ ఎవరు? వరుడు ఎవరు? ఆ వివరాలు..

తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ పెళ్లికి రెడీ అయ్యింది. 39 ఏళ్ల లేటు వయసులో ఈ ముద్దుగుమ్మ వివాహానికి సిద్దమైంది. మరి ఆ బ్యూటీ ఎవరు? వరుడు ఎవరు? ఆ వివరాలు..

39 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ! వరుడెవరంటే?

వేసవి కాలం అంటేనే పెళ్లిళ్ళ సీజన్. ఇక ఈ సీజన్ లో సామాన్యులతో పాటుగా సెలబ్రిటీలు కూడా ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీలు తమ బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ ఇచ్చి.. ఫ్యామిలీ లైఫ్ కు ఆహ్వానం పలికారు. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ పెళ్లికి రెడీ అయ్యింది. 39 ఏళ్ల లేటు వయసులో ఈ ముద్దుగుమ్మ వివాహానికి సిద్దమైంది. మరి ఆ బ్యూటీ ఎవరు? వరుడు ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఆర్తీ సింగ్.. మాయకా, ఉత్తరన్, ఉడాన్, పరిచయ్, ససురల్ సిమర్ కా, వారిస్ లాంటి టీవీ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ క్రేజ్ తో 2019 బిగ్ బాస్-13 సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఆ తర్వాత అవకాశాలు లేక డిప్రెషన్ కు గురైనట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఈరోజు(ఏప్రిల్ 5) ఆమె పుట్టినరోజు కావడంతో.. ఓ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకుంది. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 25న ప్రముఖ బిజినెస్ మెన్ దీపక్ చౌహాన్ ను పెళ్లాడబోతున్నట్లు వెల్లడించింది.

ముంబైలో తమ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగబోతున్నట్లు చెప్పుకొచ్చింది ఆర్తీ. ఇక తమది ప్రేమ వివాహం కాదని, పెద్దలు కుదిర్చిన పెళ్లని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని గురూజీ ఆలయంలో ఆర్తీ-దీపక్ నిశ్చితార్థం జరిగింది. ఇక ఈ బిగ్ బాస్ బ్యూటీ పెళ్లికి బాలీవుడ్ స్టార్స్ గోవిందా, సల్మాన్ ఖాన్, షెహనాజ్ గిల్, సిద్ధార్థ్ శుక్లా హాజరుకానున్నారు. ఆమె ప్రస్తుతం ఉమ్మీద్ కి రోష్ని శ్రావణి అనే సీరియల్ లో నటిస్తోంది. మరి లేటు వయసులో పెళ్లి పీటలెక్కుతున్న ఈ బిగ్ బాస్ బ్యూటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Arti singh sharma (@artisingh5)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి