iDreamPost

నాడు టిడిపి – బీజేపీ ప్రభుత్వం సాగనంపింది.. నేడు వైసీపీ ప్రభుత్వం స్వాగతించింది..

నాడు టిడిపి – బీజేపీ ప్రభుత్వం సాగనంపింది.. నేడు వైసీపీ ప్రభుత్వం స్వాగతించింది..

మాట తప్పం మడమ తిప్పం ఇది ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఆ ప్రకారమే రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ముందుకు దూసుకుపోతున్నారు వైఎస్ జగన్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

బిజెపి టిడిపి తొలగిస్తే..

గత టీడీపీ హయాంలో దేవాదాయ శాఖలో పనిచేస్తున్న 60 ఏళ్ల పైబడిన అర్చకులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అర్చకులు రోడ్డున పడ్డారు. వారంతా తమను తొలగించొద్దు అంటూ వేడుకున్నా ప్రభుత్వం కనికరించలేదు. హిందుత్వం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే బీజేపీ కూడా ఈ విషయంలో నోరు మెదపలేదు. 60 ఏళ్లుపైబడిన అర్చకులను తొలగిస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణయంపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ సమయంలో కేంద్రం, రాష్ట్రం లోను బిజెపి, టిడిపి కలసి అధికారం లో ఉన్నాయి. బీజేపీకి చెందిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, దివంగత పైడికొండల మాణిక్యాలరావు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉండడం గమనార్హం. అయినప్పటికీ ఈ నిర్ణయంపై ఆయన కూడా ఏం మాట్లాడకపోవడం పై సర్వత్ర అప్పట్లో విమర్శలకు తావిచ్చింది.

హైకోర్టు మొట్టికాయలు పెట్టినా..,?

అర్చకులకు రిటైర్మెంట్ వయసు నిర్ధారించడం పై హైకోర్టు అప్పట్లోనే టీడీపీ ప్రభుత్వానికి మొట్టికాయలు పెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖర్చులకు వయోపరిమితి పెట్టడం ఏమిటని ప్రశ్నించింది. దీన్నీ సంహరించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినప్పటికీ టిడిపి ప్రభుత్వం ఆ పని చేయలేదు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల పాదయాత్ర సమయంలో కలసిన అర్చకులు ఈ సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన ఆయన తాము అధికారంలోకి వస్తే హైకోర్టు తీర్పు అమలు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం అర్చకులకు రిటైర్మెంట్ విధానాన్ని తొలగించారు. ఫలితంగా తిరుమల లో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సహా 14 మంది అర్చకులు విధుల్లోకి చేరడానికి మార్గం సుగమమైంది.

ఈ విమర్శలపై సమాధానాలు..

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని దృష్టశక్తులు హిందూ దేవాలయాల పై దాడులకు తెగబడ్డాయి. దీనిపై నిందను వైసీపీ ప్రభుత్వంపై వేసేందుకు తెగ ప్రయత్నాలు చేశారు. దానికి తగ్గట్టుగానే వైసీపీ కూడా ధీటుగానే స్పందించింది. ఇప్పుడు అర్చకుల తొలగించి వైసిపి తన నిబద్ధతను మరోసారి వైసిపి నిరూపించుకుంది. హిందుత్వం తన అజెండా అని చెప్పుకునే బిజెపి ఆ పార్టీకి మద్దతు పలికిన టిడిపి రెండూ కలిపి అర్చకులను తొలగించి వేశాయి. కానీ వైసిపి వారిని తిరిగి నియమించింది. దీనిపై టిడిపి బిజెపి పార్టీలు ఏం సమాధానం చెబుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించడం లేదని వారు సూచిస్తున్నారు.

Also Read : తిరుపతి ఉప ఎన్నికలు : జనసైనికులను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ పాట్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి