iDreamPost

శ్రీవారి భక్తులకు శుభవార్త.. క్యూ లైన్‌లో ఉండాల్సిన పనిలేదు!

శ్రీవారి భక్తులకు శుభవార్త.. క్యూ లైన్‌లో ఉండాల్సిన పనిలేదు!

తిరుమల శ్రీ వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశా విదేశాల నుంచి స్వామి వారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఈ క్రమంలోనే టీటీడీ కూడా భక్తుల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌర్యాలు కలుగకుండా ఎప్పటికప్పులు చర్యలు తీసుకుంటున్నారు. అలానే  తరచూ భక్తులకు టీటీడీ  వివిధ విషయాల్లో భక్తులకు శుభవార్త చెప్తూనే ఉంటుంది. ఇప్పటికే దర్శనం విషయంలో టీటీడీ అనేక కీలక మార్పులు తీసుకొచ్చింది. తాజాగా మరో విషయంలో భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది.

భక్తుల విషయంలో టీటీడీ అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంది. దర్శనం మొదలు.. ప్రతి విషయంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనల విషయంలో  ఓ నూతన విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇప్పటి వరకు ఆఫ్ లైన్ ద్వారా  ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. గతంలో స్వామివారి సేవా టికెట్లు పొందిన వాళ్లు కౌంటర్లలో క్యూలైన్ లో నిల్చుని నగదు చెల్లించాల్సి వచ్చేంది.  అయితే  ఆ సమస్యను తొలంగించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. “పే లింక్” ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లకుండా ఆన్ లైన్లో  సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు.

 భక్తులు  పే లింక్ పైన క్లిక్ చేసి యుపీఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్ లైన్ లో డబ్బులు  చెల్లించవచ్చు. ఈ కొత్త విధానాన్ని ప్రస్తుతం సిఆర్వోలోని లక్కీడిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రతి నెలా సీఆర్‌వోలో లక్కీడిప్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను భక్తులకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానంలో టికెట్లు పొందిన భక్తులు కౌంటర్ వద్దకు నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి వచ్చేది.  లక్కీడ్రిప్ టోకెన్లే కాకుండా త్వరాలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలుకానుంది. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాలని టీటీడీ సూచించింది. మరి.. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండిజాతీయ స్థాయిలో సత్తా చాటిన AP యువతి.. మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా కిరీటం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి