iDreamPost

ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పిన TSRTC

ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పిన TSRTC

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు వారి సులువైన ప్రయాణం గురించి ఆలోచిస్తుంటుంది. ఇక సజ్జనార్ TSRTC ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రయాణికులకు ఎక్కడా కూడా ఇబ్బందులు ఉన్న వెంటనే స్పందిస్తూ RTCని లాభాల్లో పరిగెత్తేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. ఇక మొన్నటి మొన్న రాఖీ పండగ నేపథ్యంలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది మరువకముందే తాజాగా రోజు శుభావార్త చెప్పింది TSRTC.

అదేంటంటే? విజయవాడ, ఎయిర్ పోర్టుల నుంచి ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. ప్రయాణికుల తాకిడి పెరగడంతో ఈ బస్సులను మరిన్ని పెంచే ఆలోచనట్లు ఉందట TSRTC.అయితే ఈ బస్సులను జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ ఎలక్ట్రిక్ బస్సులను నడిచే రూట్లు ఎక్కడెక్కడ అనేది కూడా త్వరలో తెలియజేయనుందట. ఇందు కోసం ప్రజల నుంచి అభిప్రాయాలను సైతం తెలుసుకోనుందట TSRTC.మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనుండడంతో నగర ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి