iDreamPost

పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ఆ ప్రశ్నలకు మార్కులు కలిపేందుకు రెడీ

  • Published Apr 05, 2024 | 10:47 AMUpdated Apr 05, 2024 | 11:24 AM

TS SSC Board

TS SSC Board

  • Published Apr 05, 2024 | 10:47 AMUpdated Apr 05, 2024 | 11:24 AM
పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ఆ ప్రశ్నలకు మార్కులు కలిపేందుకు రెడీ

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగిశాయి. అధికారులు ఇప్పుడు ప్రశ్నాపత్రలు కరెక్షన్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా పదో తరగతి విద్యార్థులకు ఎస్ఎస్సీ బోర్డు శుభవార్త చెప్పింది. ఈ సారి జరిగిన పరీక్షల్లో ఓ సబ్జెక్ట్ ప్రశ్నాపత్రంలో తప్పులు వచ్చాయి. దాంతో విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు. ఈ క్రమంలో ఎస్ఎస్సీ బోర్డు ఆ ప్రశ్నలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మార్కులు కలిపేందుకు అంగీకరించింది. ఆ వివరాలు..

ఈఏడాది పదో తరగతి పరీక్షల్లో జీవశాస్త్రం(బయాలజీ) ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయి. విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. పరీక్షలు అయిపోయినప్పిటికీ.. తప్పుగా వచ్చిన ప్రశ్నల విషయంలో బోర్డు నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో.. విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఎస్ఎస్సీ బోర్డు దీనిపై స్పందించి.. తప్పు వచ్చిన ప్రశ్నలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై స‌బ్జెక్ట్‌ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని ఎస్ఎస్సీ బోర్డు నిర్ణయించింది.

మార్చి 28వ తేదీన పదో తరగతి బయోలజీ ఎగ్జామ్ జరిగింది. అయితే ఇందులో 2వ సెక్షన్ లోని 6వ క్వశ్చన్ విషయంలో తప్పులు దొర్లాయి. ఇంగ్లీష్, తెలుగు మీడియంలో వచ్చిన ప్రశ్న విషయంలో తేడా ఉండటంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ఇదే విషయాన్ని పలువురు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై నిపుణుల కమిటీ కూడా చర్చించి.. తప్పుగా దొర్లిన ప్రశ్నల విషయంలో ఓ నివేదికను కూడా సమర్పించింది.

అంతేకాక బ్లూ ప్రింట్ విధానానికి విరుద్ధంగా ప్రశ్న ఇచ్చినట్లు కమిటీ తేల్చింది. ఫలితంగా ఈ రెండు ప్రశ్నలకు మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. ముందు 2 ప్రశ్నలు రాసిస విద్యార్థులకు 2 మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఇదే రెండో విభాగంలోని.. ఐదో ప్రశ్న విషయంలో అనుబంధ సమాధానాలు రాస్తే మార్కులు ఇవ్వనున్నారు. ఇవే కాకుండా.. ఉర్దూ మీడియానికి సంబంధించి మ్యాథ్స్ పేపర్ లో తలెత్తిన కొన్ని తప్పులపై కూడా బోర్డు అధికారులు.. ఎగ్జామినర్లకు ఆదేశాలు సూచనలు చేశారు.

తెలంగాణ పదో తరగతి జవాబు మూల్యాంకనం ఏప్రిల్ 11వ తేదీతో పూర్తి కానుంది. ఆ తర్వాత మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతిక అంశాలను పరిశీలన చేసి.. టెన్త్‌ ఫలితాలు ఏప్రిల్ చివ‌రి వారంలో కానీ.. మే 2 లేదా 3వ తేదీలలో విడుద‌ల చేసే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి