iDreamPost

ఇంత దారుణం ఎలా చేశావ్ తల్లి.. అమ్మానాన్న గుర్తు రాలేదా?

  • Published Apr 12, 2024 | 7:44 AMUpdated Apr 12, 2024 | 7:47 AM

క్షణికావేశంలో ఓ యువతి తీసుకున్న నిర్ణయం ఆమె కుటుంబంలో ఆరని చిచ్చు పెట్టింది. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చింది. ఇంతకు ఏం జరిగింది అంటే..

క్షణికావేశంలో ఓ యువతి తీసుకున్న నిర్ణయం ఆమె కుటుంబంలో ఆరని చిచ్చు పెట్టింది. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చింది. ఇంతకు ఏం జరిగింది అంటే..

  • Published Apr 12, 2024 | 7:44 AMUpdated Apr 12, 2024 | 7:47 AM
ఇంత దారుణం ఎలా చేశావ్ తల్లి.. అమ్మానాన్న గుర్తు రాలేదా?

జీవితం అంటే సుఖాలు, సంతోషాలు మాత్రమే కాదు.. దుఖం, బాధ, కష్టాలు కూడా ఉంటాయి. అన్నింటిని దాటుకుని ముందుకు సాగడమే మనిషి చేయాల్సిన పని. మరి నేటి సమాజం తీరే అలా ఉందో.. లేక పెంపంలో వచ్చిన మార్పులో కానీ.. చిన్న చిన్న కారణాలకే జీవితాలను అంతం చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వారికి వచ్చిన కష్టం తెలుసుకుంటే.. ఇంత చిన్న విషయానికే ఇలాంటి దారుణ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అనిపించకమానదు. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయం కారణంగా తల్లిదండ్రులు జీవితకాలం ఏడుస్తూనే ఉండాలి. కళ్లల్లో పెట్టుకుని చూసుకున్న బిడ్డలు.. తమ కడుపున ఆరని చిచ్చు పెడితే.. వారిని ఎవరు ఓదార్చాలి.. ఏమని ఓదార్చిలి. పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి కూడా తన తల్లిదండ్రులకు తీరని దుఖాన్ని కానుకగా ఇచ్చి తన దారిన తాను వెళ్లిపోయింది. ఆ వివరాలు..

పైన ఫొటోలో ఎంతో అందంగా కనిపిస్తున్న యువతిని చూశారుగా.. చిరునవ్వులు చిందిస్తూ ఎంత అందంగా ఉందో కదా. డిగ్రీ చదువుతోన్న ఆ యువతి.. చిన్న కారణంగా ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రలకు తీరని దుఖాన్ని మిగిల్చింది. అడగ్గానే సెల్ ఫోన్ రిపేర్ చేయించనందుకు ఇంత దారుణ నిర్ణయం తీసుకుంది. ఈ విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా, జైపూర్ మండటం, వేలాల గ్రామంలో గురువారం నాడు వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం ఉన్నారు. కూతురు పేరు సాయిషుమా(19).. మంచిర్యాలలోని ఓ కాలేజీలో డిగ్రీ మొదటి ఏడాది చదువుతోంది. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్ పాడైపోయింది. దాన్ని రిపేర్ చేయించమని అన్నలను, తల్లిదండ్రలును అడిగింది. ఎన్నిసార్లు బాగు చేయించాని.. పదే పదే పాడు చేస్తున్నావంటూ తల్లిదండ్రులు సాయిషూమాను మందలించారు. ప్రస్తుతం చేతిలో డబ్బులు లేవని.. కొన్ని రోజుల తర్వాత ఫోన్ బాగు చేయిస్తామని చెప్పారు.

తల్లిదండ్రుల మాటలు విన్న సాయిషుమా తీవ్ర మనస్థాపానికి గురైంది. అన్నలు అడగ్గానే వెంటనే చేస్తారు.. తాను అడిగితే మాత్రం ఏమీ చెయ్యరు అని బాధపడింది. విచక్షణ కోల్పోయి దారుఱ నిర్ణయం తీసుకుంది. గురువారం తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన కాసేపటికి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు జరిగిన దారుణం గమనించి వెంటనే సాయిషుమాను కిందికి దించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మొబైల్ కన్నా నీ జీవితం ఖరీదు ఎక్కువ కదా తల్లి.. ఎందుకు మాకు ఇంత అన్యాయం చేశావంటూ ఆమె తల్లిదండ్రలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి