iDreamPost

వ్యవసాయ కుటుంబం.. ఆర్థిక కష్టాలు.. అయినా ఇంటర్లో 993 మార్కులు

  • Published Apr 25, 2024 | 10:12 AMUpdated Apr 25, 2024 | 12:26 PM

TS Inter Results 2024: అన్ని వసుతులు కల్పించి.. బాగా చదువుకోమని చెప్పినా.. ఫెయిల్ అయ్యే విద్యార్థులు ఎందరో ఉన్నారు. వారందరికి ఆదర్శం ఈ స్టూడెంట్‌. ఎన్ని కష్టాలు వచ్చినా చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఇంటర్లో 993 మార్కలు సాధించి రికార్డు క్రియేట్‌ చేసింది. ఆ వివరాలు..

TS Inter Results 2024: అన్ని వసుతులు కల్పించి.. బాగా చదువుకోమని చెప్పినా.. ఫెయిల్ అయ్యే విద్యార్థులు ఎందరో ఉన్నారు. వారందరికి ఆదర్శం ఈ స్టూడెంట్‌. ఎన్ని కష్టాలు వచ్చినా చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఇంటర్లో 993 మార్కలు సాధించి రికార్డు క్రియేట్‌ చేసింది. ఆ వివరాలు..

  • Published Apr 25, 2024 | 10:12 AMUpdated Apr 25, 2024 | 12:26 PM
వ్యవసాయ కుటుంబం.. ఆర్థిక కష్టాలు.. అయినా ఇంటర్లో 993 మార్కులు

చదువుకోవాలనే ఆసక్తి ఉంటే.. ఎన్ని కష్టనష్టాలైనా సరే ఓర్చుకుని.. శ్రద్ధగా చదువుకుంటారు. ఏమాత్రం సమయం దొరికినా.. వృధా చేయరు. ఇక కొందరైతే పగలంతా పని చేస్తూ.. రాత్రి నిద్ర మానుకుని చదువుకుంటారు. ఇంటి సమస్యలు, ఆర్థిక కష్టాలు ఇవేవి వారిని అడ్డుకోలేవు. వాటన్నింటిని దాటు కోవాలంటే.. చదువు ఒక్కటే మార్గం అని వారికి కూడా తెలుసు. అందుకే ఎన్ని కష్టాలెదురైనా సరే.. చదువును మాత్రం నిర్లక్ష్యం చేయరు. అలాంటి ఓ విద్యార్థిని గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. తల్లిదండ్రులు వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ.. బిడ్డలను పోషించారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. చదువును మాత్రం విడిచిపెట్టవద్దు అని చెప్పారు. తండ్రి మాటను మనసుకు ఎక్కించుకున్న ఆ బాలిక.. కష్టపడి చదివి ఇంటర్లో 1000 మార్కులకు గాను ఏకంగా 993 మార్కులు సాధించి.. ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆ వివరాలు..

మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్‌లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించి.. ఎందరికో ఆదర్శంగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది ఫలితాల్లో భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన బాణోతు అంజలి ఈ ఘనత సాధించడం విశేషం. ఇక ఈ విద్యార్థిని కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. అంజలి తండ్రి నర్సింహారావు, తల్లి జ్యోతి.. వీరికి ఇ‍ద్దరు సంతానం. ఇక వీరికున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు వెళ్తుంటారు.

కేవలం నాలుగో తరగతి వరకే చదువుకున్న అంజలి తండ్రికి.. చదువు విలువ బాగా తెలుసు. తనంటే ఉన్నత చదువులు చదవలేకపోయాడు. కానీ తన పిల్లలకు మాత్రం అలాంటి పరిస్థితి రాకూడదని భావించాడు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. పిల్లల చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తండ్రి కోరికను అర్థం చేసుకున్న బిడ్డలు బాగా చదువుకునేవారు. ఇక అంజలికి చిన్నప్పటి నుంచే చదువంటే ఎంతో ఇష్టం. సొంత ఊరిలోనే 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకుంది.

ఆ తర్వాత జ్యోతిరావు ఫులే వెనకబడిన తరగతులు గురుకుల విద్యాలయం ప్రవేశ పరీక్ష రాసింది. భద్రాచలంలో విద్యాలయంలో సీటు రావటంతో ఆరో తరగతి నుంచి పదోతరగతి వరకు అక్కడే చదువుకుంది. పదో తరగతి మంచి మార్కులు సాధించడంతో.. మెరిట్‌ విద్యార్థుల జాబితాలో ఖమ్మంలోని శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీలో అంజలికి సీటు వచ్చింది. రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించాలని లక్ష్యం పెట్టుకున్న అంజలి ఇంటర్‌ ఫస్టియర్‌లో 466 మార్కులు సాధించింది. సెకండియర్‌లో మరింత పట్టుదలతో చదివి 1000కి గాను 993 మార్కులు సాధించింది. మారుమూల గ్రామంలో జన్మించిన గిరిజన బిడ్డ అగ్రస్థానంలో నిలవడంపై ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు. అంజలి ఎందరికో ఆదర్శం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి