iDreamPost

మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్‌ రిలీజ్‌.. రూ.500 గ్యాస్ సిలిండర్‌కి అర్హులు వీళ్లే

  • Published Feb 27, 2024 | 3:27 PMUpdated Feb 27, 2024 | 3:27 PM

Gas Cylinder For Rs 500: కాంగ్రెస్‌ ప్రభుత్వం నేడు 500 లకే గ్యాస్‌ సిలిండర్‌, ఉచిత కరెంట్‌ హామీలను అమలు చేయబోతుంది. వాటికి సంబంధించి గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. ఆ వివరాలు..

Gas Cylinder For Rs 500: కాంగ్రెస్‌ ప్రభుత్వం నేడు 500 లకే గ్యాస్‌ సిలిండర్‌, ఉచిత కరెంట్‌ హామీలను అమలు చేయబోతుంది. వాటికి సంబంధించి గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. ఆ వివరాలు..

  • Published Feb 27, 2024 | 3:27 PMUpdated Feb 27, 2024 | 3:27 PM
మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్‌ రిలీజ్‌.. రూ.500 గ్యాస్ సిలిండర్‌కి అర్హులు వీళ్లే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిల్లో మహిలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అలానే ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.10 లక్షల రూపాయలకు పెంచారు. ఇదిలా ఉండగా.. నేడు అనగా ఫిబ్రవరి 27న మరో రెండు గ్యారెంటీలను అమలు చేయడానికి రెడీ అవుతోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. రూ.500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రూ.500 సిలిండర్‌ పథకం అర్హుల కోసం మూడు కండిషన్లు పెట్టింది. ఆ వివరాలు..

మహిళల ఆరోగ్యం కాపాడుతూ, పొగబారి నుంచి వారికి విముక్తి కల్పించడమే మహాలక్ష్మీ పథకం ముఖ్య ఉద్దేశ్యమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే తమ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింద. దీని ప్రకారం ఈ పథకానికి అర్హులు కావాలంటే 3 కండిషన్లు ఫాలో అవ్వాలి. అవి..

500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ పొందాలంటే.. వారు ప్రజా పాలన దరఖాస్తు చేసుకుని ఉండాలి. అలానే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవాళ్లకి మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్ రాయితీ పథకం వర్తిస్తుంది. గ్యాస్‌ కనెక్షన్‌ మహిళల పేరు మీద ఉండాలి. ఈ మూడు కండిషన్లు ఫాలో అయిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం.. గడిచిన మూడేళ్లుగా గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోనుంది. సబ్సిడీని ప్రభుత్వం ప్రతినెలా ఆయా కంపెనీలకు చెల్లింపులు చేస్తుంది. నేటి నుంచి ఈ పథకం అమలు కానుంది.

మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, రూ.500లకు గ్యాస్ సిలిండర్‌, నెలకు రూ.2,500 నగదు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండో రోజునే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించారు.

నేడు ఉచిత విద్యుత్, రాయితీపై గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సెక్రటేరియట్‌ నుంచే ఈ రెండు పథకాలను మొదలుపెట్టనున్నారు. 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకాలను మంగళవారం మధ్యాహ్నం సీఎం రేవంత్, మంత్రులు లాంఛనంగా ప్రారంభిస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి