iDreamPost

ఇక నుంచి వారికి ఫ్రీ కరెంట్ రాదు.. పూర్తి బిల్లు కట్టక తప్పదు..!

Gruha Jyothi Scheme: తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ను రేవంత్ సర్కార్ అందిస్తుంది. అయితే సమ్మర్ నేపథ్యంలో ఈ స్కీమ్ విషయంలో ఈ కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Gruha Jyothi Scheme: తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ను రేవంత్ సర్కార్ అందిస్తుంది. అయితే సమ్మర్ నేపథ్యంలో ఈ స్కీమ్ విషయంలో ఈ కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక నుంచి వారికి  ఫ్రీ కరెంట్ రాదు.. పూర్తి బిల్లు కట్టక తప్పదు..!

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన సంగతి తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల హామీతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అనంతరం హామీలను నిరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే రేవంత్ సర్కార్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా గృహజ్యోతి స్కీమ్ కింద రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ను అందిస్తుంది. పథకాన్ని రెండు నెలల క్రితమే ప్రారంభించింది. అయితే తాజాగా ఈ స్కీమ్ విషయంలో కొన్ని మార్పులు చేయడానికి  ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందిస్తుంది. అలానే రూ.500లకే  గ్యాస్ ను మహిళలకు అందిస్తుంది. రైతుల విషయంలో కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటితో పాటు ఉచితంగా కరెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ను  రేవంత్ సర్కార్ అమలు చేస్తోంది. ఈ స్కీం అమల్లో కొచ్చి రెండు నెలలు దాటింది. అయితే ఈ పథకంలో ఇప్పుడు కొన్ని మార్పులు చేయడానికి ప్రభుత్వం చర్యలు  ప్రారంభించింది.

రాష్ట్రంలో ఎండలు  తీవ్రత బాగా పెరిగింది. ఈ సమ్మర్ హీట్ ను తట్టుకోలేక అందరు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇళ్లలో ఏసీ ,ఫ్యాన్, కూలర్ వంటి వాటి వినియోగం అధికంగా పెరిగిపోతుంది. ప్రభుత్వం ఇచ్చే 200 యూనిట్లు పైగా వాడుతున్న కొంతమంది విద్యుత్ బిల్లు మొత్తం చెల్లిస్తున్నారు. సాధారణ రోజుల్లో తక్కువ కరెంటు వారే వారు కూడా వేసవి కాలం ఎక్కువ కరెంటును వాడుతున్నారు. అందుకే వీరు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. వేసవి కారణంగా అదనంగా 20 శాతం విద్యుత్తు వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది.

దీంతో గృహ జ్యోతి ద్వారా ఉచిత కరెంట్ పొందుతున్న వారు కూడా నేడు ఇతరుల మాదిరిగానే పూర్తి కరెంట్ బిల్లు చెల్లించవలసి ఉంటుంది. 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడితో విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వేసవిలో మితిమీరిన విద్యుత్ వాడే వారు ప్రభుత్వ నిర్దేశించిన యూనిట్ కంటే ఎక్కువ వాడితే.. అదనపు యూనిట్లుకు మాత్రమే కాకుండా మొత్తం బిల్లు చెల్లించవలసి వస్తుందని తెలుస్తోంది. కాబట్టి ఎక్కువ కరెంటు వినియోగిస్తున్న వారు కాస్త వినియోగాన్ని తగ్గించుకుంటే ఈ సమస్యను ఉండదు. ప్రస్తుతం 200 యూనిట్లకు పైగా కరెంట్ వినియోగించడంతో చాలామంది మొత్తం బిల్లు చెల్లించవలసి వస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి