iDreamPost

Revanth Reddy: ఆ అధికారి రాజీనామాను ఆమోదించవద్దు.. సీఏం రేవంత్ రెడ్డి ఆదేశం

  • Published Dec 08, 2023 | 10:40 AMUpdated Dec 08, 2023 | 10:40 AM

తెలంగాణలో కొలువుదీరిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం.. గురువారం నాడే తొలి కేబినెట్ సమావేశం నిర్వహించింది. విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై అధికారును ప్రశ్నించిన రేవంత్.. ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి రాజీనామాను ఆమోదించవద్దని ఆదేశించారు. ఆ వివరాలు..

తెలంగాణలో కొలువుదీరిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం.. గురువారం నాడే తొలి కేబినెట్ సమావేశం నిర్వహించింది. విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై అధికారును ప్రశ్నించిన రేవంత్.. ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి రాజీనామాను ఆమోదించవద్దని ఆదేశించారు. ఆ వివరాలు..

  • Published Dec 08, 2023 | 10:40 AMUpdated Dec 08, 2023 | 10:40 AM
Revanth Reddy: ఆ అధికారి రాజీనామాను ఆమోదించవద్దు.. సీఏం రేవంత్ రెడ్డి ఆదేశం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. హస్తం పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కేబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇక సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే.. ఎన్నికల ప్రచార సమయంలో చెప్పినట్టుగానే.. ముందుగా ఆరు గ్యారెంటీల అమలుపై సంతకం చేశారు రేవంత్ రెడ్డి. అలానే రెండో సంతకం దివ్యాంగురాలు రజినీకి అందించే ఉద్యోగ నియామక పత్రంపై చేశారు. ఆ తర్వాత మొదటి కేబినెట్ సమావేశం నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కేబినేట్ సమావేశంలో భాగంగా ముందుగా విద్యుత్ శాఖపై సమీక్ష చేశారు. విద్యుత్‌ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆ శాఖలో వాస్తవాలను వెల్లడించకుండా చాలాకాలంగా దాచిపెట్టడాన్ని తప్పుపడుతూ.. ఆ శాఖ ఉన్నతాధికారిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్‌ అభిప్రాయపడినట్లు సమాచారం. విద్యుత్‌ సంస్థలకు ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులున్నట్లు సీఎం రేవంత్ కు అధికారులు ఈ సందర్భంగా వివరించారని తెలుస్తోంది.

ఆయన రాజీనామా ఆమోదించవద్దు..

దాంతో.. శుక్రవారం దీనిపై సమీక్ష చేయాలని.. విద్యుత్ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధం కావాలని రేవంత్‌ ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. పలువురు రాజీనామా చేయగా.. వారిలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు కూడా ఉన్నారు. అయితే ఆయన రాజీనామాను ఆమోదించవద్దని.. శుక్రవారం నాటి సమీక్ష సమావేశానికి ప్రభాకరరావును కూడా పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం నాడు సీఎం రేవంత్.. విద్యుత్‌శాఖపై ప్రత్యేకంగా సమీక్ష చేయనున్నారు.

ఇక తొలి కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా ఆరు గ్యారంటీలపై చర్చ జరిగిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రైతులకు పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ అందించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. 2014 నుంచి విద్యుత్ శాఖలో అనేక తప్పులు, తడకలు, ప్రణాళిక లేని నిర్ణయాలను గత ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని.. వాటన్నింటిని నేడు సీఎం సమీక్ష చేస్తారని తెలిపారు. విద్యుత్‌కు అంతరాయం కలుగకుండా ప్రజలకు నిరంతాయంగా విద్యుత్ అందించాలని కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కు కేబినెట్ ఆమోదించందని.. 9వ తేదీన కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్..

కేబినెట్ భేటీకి ముందు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. గురువారం సాయంత్రం 4.20 గంటలకు రేవంత్‌ సచివాలయానికి చేరుకున్నారు. ఆయనకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, సచివాలయ ఉద్యోగులు ఘన స్వాగతం, పోలీసులు గౌరవ వందనం మధ్య సచివాలయం వద్దకు చేరుకున్నారు రేవంత్.

ప్రధాన ద్వారం వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికారు పండితులు. సాయంత్రం 4.30 గంటలకు ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. సతీమణి గీతతో కలిసి పూజలు నిర్వహించారు. ముహూర్తం ప్రకారం 4.46 గంటలకు సీఎం కుర్చిపై కూర్చుని.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి