iDreamPost

కొత్త సంవత్సరం వేళ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు. . ఏంటంటే

  • Published Jan 01, 2024 | 11:18 AMUpdated Jan 01, 2024 | 11:18 AM

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. పాలనలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ సందర్భంగా.. ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆ వివరాలు..

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. పాలనలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ సందర్భంగా.. ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆ వివరాలు..

  • Published Jan 01, 2024 | 11:18 AMUpdated Jan 01, 2024 | 11:18 AM
కొత్త సంవత్సరం వేళ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు. . ఏంటంటే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ నేతలు చేబుతున్నారు. ఈ క్రమంలో ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభించి.. ఆరు గ్యారెంటీలకు లబ్ధిదారులను ఎంపిక చేసే పని ప్రారంభించింది. వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

నూతన సంవత్సరం వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. జనవరి 5వ తారీఖులోపే వారి ఖాతాల్లో జీతాలు వేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత  ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగులకు 10 నుంచి 15 తారీఖైన సరే జీతాలు రాక ఇబ్బంది పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ దీనిపై దృష్టి సారించింది. జనవరి 5 లోపే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించినట్టు సమాచారం.

good news for ts govt emplyees

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపయినా సరే.. 5వ తారీఖులోపే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు వేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణలు దృష్టిలో పెట్టుకుని.. రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ దూకుడుగా ముందుకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే.. అన్ని శాఖల్లో పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టిన సర్కార్.. నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తోంది.

అంతేకాక అధికారులు అప్రమత్తంగా పని చేయాలని.. విధుల్లో నిర్లక్ష్యం పనికి రాదని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాగా.. సరైన సమయంలో జీతాలు ఇస్తే.. ఉద్యోగులు కూడా ఉత్సాహంగా సేవలందిస్తారని భావిస్తోన్న ప్రభుత్వం.. జనవరి 5లోపే జీతాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. కేవలం జనవరి నెలకే పరిమితం కాకుండా.. ఇలా ప్రతి నెలా 5 లోపే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి