iDreamPost

Nani-Trivikram: నానికి మంచి రోజులు.. ఏకంగా లైన్ లోకి త్రివిక్రమ్?

  • Author Soma Sekhar Published - 08:48 PM, Tue - 12 December 23

నాచురల్ స్టార్ నాని మంచి స్వింగ్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నాని-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.

నాచురల్ స్టార్ నాని మంచి స్వింగ్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నాని-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.

  • Author Soma Sekhar Published - 08:48 PM, Tue - 12 December 23
Nani-Trivikram: నానికి మంచి రోజులు.. ఏకంగా లైన్ లోకి త్రివిక్రమ్?

సాధారణంగా ఓ స్టార్ హీరో సెట్స్ పై ఓ సినిమా ఉండగానే మరో మూవీని లైన్లో పెడతాడు. ఇక ఇటు డైరెక్టర్లు కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతుండటం మనకు తెలిసిన విషయమే. ఓ హీరోతో సినిమా చేస్తుండగానే మరో సినిమాను పట్టాలు ఎక్కిస్తుంటారు దర్శకులు. ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులు ఫుల్ స్పీడ్ లో ఉన్నారు. ముందుగా ప్రకటించిన మూవీ కాస్త ఆలస్యమైతే.. మరో హీరోతో జతకడదానికి రెడీగా ఉంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ న్యూసే ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బన్నీతో చిత్రం ఏ మాత్రం ఆలస్యమైనా ఆ గ్యాప్ లో నాచురల్ స్టార్ నానితో ఓ పిక్చర్ ను ప్లాన్ చేస్తున్నాడట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నాని కామెడీ టైమింగ్ కు త్రివిక్రమ్ రైటింగ్ తోడైతే.. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమే. ఇక ఇటు బన్నీ పుష్ప 2 మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ బ్రేక్ పడింది. పుష్పలో లీడ్ క్యారెక్టర్ అయిన జగదీష్ అరెస్ట్ కావడంతో.. అతడిని సినిమా నుంచి తప్పిస్తారా? లేదా అతడు రిలీజైనదాక ఆగుతారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇదే కనుక జరిగితే పుష్ప 2 షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో బన్నీ ఆ మూవీలోనే ఉండాల్సి వస్తుంది. ఇక ఇప్పటికే గుంటూరు కారం మూవీని కంప్లీట్ చేసిన గురూజీ.. ఈ గ్యాప్ లో నానితో ఓ చిత్రాన్ని తియ్యాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ కనువిందైన కాంబినేషన్ చూసే అదృష్టం దక్కుతుంది. ఇక నాని తాజాగా ‘హాయ్ నాన్న’ మూవీతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా.. నాని నాచురల్ యాక్టింగ్ త్రివిక్రమ్ పంచు డైలాగ్స్ తోడైతే.. థియేటర్ మెుత్తం నవ్వులతో మారుమ్రోగుతుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి నాని-త్రివిక్రమ్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి