iDreamPost

గుంటూరు కారం.. ఫస్ట్ టైమ్ ఆ రూల్ బ్రేక్ చేస్తున్న గురూజీ?

  • Author ajaykrishna Updated - 11:21 AM, Sat - 23 September 23
  • Author ajaykrishna Updated - 11:21 AM, Sat - 23 September 23
గుంటూరు కారం.. ఫస్ట్ టైమ్ ఆ రూల్ బ్రేక్ చేస్తున్న గురూజీ?

ఇండస్ట్రీలో దర్శకులు కూడా అప్పుడప్పుడు తమ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో రొటీన్ ప్రాసెస్ ని మార్చేస్తుంటారు. కొన్నిసార్లు తాము పెట్టుకున్న రూల్స్ తామే బ్రేక్ చేస్తుంటారు. ఇంకొన్నిసార్లు తీస్తున్న సినిమా అవసరాన్ని బట్టి.. హీరో ఇమేజ్ కి బట్టి మార్పులు అప్పటికప్పుడు చేసేస్తుంటారు. ఎందుకు రెగ్యులర్ స్టైల్ ని మార్చేశారు? అనడం కంటే.. మూసధోరణిలో సినిమా తీయట్లేదంటే ఖచ్చితంగా కొత్తదనం ఉండబోతుందని ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. ప్రస్తుతం గుంటూరు కారం విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ అలాంటి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నాడని టాక్. తాను ఎన్నో ఏళ్లుగా పెట్టుకున్న రూల్ ని ఈ సినిమా కోసం బ్రేక్ చేస్తున్నాడని అంటున్నారు.

ఆ వివరాల్లోకి వెళ్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమాగా గుంటూరు కారం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత చాలా ఏళ్లకు వీరి కాంబోలో గుంటూరు కారం సెట్ అయ్యింది. మహేష్ బాబుతో రెగ్యులర్ యాక్షన్ మూవీ కాకుండా.. మాస్ టచ్ తో ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నాడు త్రివిక్రమ్. ఇందులో మహేష్ క్యారెక్టర్, డైలాగ్ డెలివరీ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. చాలా రోజుల తర్వాత మహేష్ సాఫ్ట్ గా కాకుండా కాస్త రఫ్ గా కనిపించేసరికి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఎందుకంటే.. శ్రీమంతుడు నుండి సర్కారు వారి పాట వరకు మహేష్ చాలా సెటిల్డ్ క్యారెక్టర్స్ చేశాడు.

అందుకే ఇప్పుడు గుంటూరు కారం టైటిల్ కి తగ్గట్టుగా మాస్ పల్స్ తో ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చేశారు. సో.. ఫ్యాన్స్ అంతా 2024 సంక్రాంతి రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్రివిక్రమ్ కెరీర్ లో ఐటమ్ సాంగ్ అనేది లేదు. ఫస్ట్ టైమ్ గుంటూరు కారం కోసం ఆ రూల్ బ్రేక్ చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఈ ఐటమ్ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ కనిపించనుండగా.. కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ విషయంపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి గుంటూరు కారం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి