iDreamPost

Yashasvi Jaiswal: జైస్వాల్ సూపర్ సెంచరీ.. ఖాతాలో ఖతర్నాక్ రికార్డ్!

ముంబై ఇండియన్స్ పై సెంచరీ సాధించడంతో.. ఓ ఖతర్నాక్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు రాజస్తాన్ రాయల్స్ యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

ముంబై ఇండియన్స్ పై సెంచరీ సాధించడంతో.. ఓ ఖతర్నాక్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు రాజస్తాన్ రాయల్స్ యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

Yashasvi Jaiswal: జైస్వాల్ సూపర్ సెంచరీ.. ఖాతాలో ఖతర్నాక్ రికార్డ్!

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మళ్లీ పరాజయాల బాట పట్టింది. రెండు వరుస విజయాల తర్వాత నీరసించిపోయిందో ఏమో గానీ.. ఓటములు చవిచూస్తూ వస్తోంది. తాజాగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ముంబై చిత్తైంది. బ్యాటింగ్ లో స్టార్ ప్లేయర్లు విఫలం కావడం, బౌలింగ్ లో ఆర్ఆర్ బ్యాటర్ల ముందు తేలిపోవడంతో.. దారుణ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో సూపర్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో ఖతర్నాక్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

యశస్వీ జైస్వాల్.. ఈ ఐపీఎల్ సీజన్ కు ముందు భీకరఫామ్ లో ఉన్నాడు. కానీ ఈ టోర్నీ ప్రారంభం అయిన తర్వాత అతడి నుంచి ఒక్క మ్యాచ్ విన్నింగ్ ఫర్ఫామెన్స్ కూడా రాలేదు. అదీకాక తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్ కు ముందు ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టలేకపోయాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ముంబై బౌలర్లను ఓ ఆటాడుకుంటూ.. 59 బంతుల్లో సెంచరీ బాదాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 60 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచి, టీమ్ కు విజయాన్ని అందించాడు. బట్లర్(35), కెప్టెన్ సంజూ శాంసన్(38*) పరుగులతో రాణించారు. ఇక ఈ సెంచరీతో యశస్వీ జైస్వాల్ అకౌంట్ లో స్పెషల్ రికార్డు వచ్చి చేరింది.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా జైస్వాల్ నిలిచాడు. 22 ఏళ్ల యశస్వీ.. తన ఐపీఎల్ కెరీర్ లో 2 సెంచరీలు బాదాడు. దీంతో క్యాష్ రిచ్ లీగ్ లో అత్యంత పిన్న వయస్సులో ఎక్కువ శతకాలు బాదిన ప్లేయర్ గా జైస్వాల్ ఘనతకెక్కాడు. కాగా.. ఈ సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. లక్ష్యం చిన్నదేమీ కాకపోయినా.. ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు రాజస్తాన్ ఓపెనర్లు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. జట్టులో తిలక్ వర్మ(65),నేహల్ వాధేర(49) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో అదరగొట్టాడు. అనంతరం 180 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్ఆర్ టీమ్.. ఏ దశలోనూ తడబడలేదు. ఆడుతూ, పాడుతూ లక్ష్యాన్ని ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లో ఛేదించింది. మరి ఈ సూపర్ సెంచరీతో స్పెషల్ రికార్డ్ సాధించిన జైస్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి